మాజీ జస్టిస్ కి కీలక పదవి అప్పజెప్పిన సీఎం జగన్?
అయితే గత ఏడాది ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం జస్టిస్ కనకరాజ్ ను నియమించింది. ఆ తర్వాత ఎన్నో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరికి హైకోర్టు ఆదేశంతో జస్టిస్ కనకరాజ్ ఎన్నికల కమిషనర్ పదవి కోల్పోయారు. అయితే ఇక రిటైర్డ్ జడ్జికి సముచిత గౌరవం ఇవ్వాలని జగన్ భావించారు. ఈ క్రమంలోనే గతం లోనే పోలీస్ కంప్లైంట్ అత్తారింటి ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ఇటీవలే దీనికి చైర్మన్గా కనక రాజ్ ను నియమించింది ప్రభుత్వం.
పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించే బాధ్యతలు చేపట్టనుంది పోలీస్ కంప్లైంట్ అథారిటీ. అంతే కాకుండా ప్రజలకు పోలీసులు న్యాయం చేయకపోయినా ఒకవేళ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించక పోయినా ఇక పోలీస్ కంప్లైంట్ అథారిటీని ప్రజలు ఆశ్రయించవచ్చు. అయితే పోలీసుల పై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు అన్ని రాష్ట్రాలలో కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఇలాంటి అథారిటీలు ఏర్పడ్డాయ్. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఏర్పడింది. అయితే ఇక పోలీస్ కంప్లైంట్ అథారిటీలో రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ లతోపాటు ప్రభుత్వం ఎంపిక చేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉంటారు.