జగన్ దిశ యాప్.. హోమ్ మంత్రి సుచరిత ఏమన్నాడో తెలుసా?
కేవలం మొబైల్ ని ఐదు సార్లు షేక్ చేయడం వల్ల లేదా ఒక్క బటన్ నొక్కడం వల్ల ఇక ఆడపిల్లలు ప్రమాదం లో ఉన్నారు అని పోలీసులు కంప్లైంట్ అందుకుంటారు తద్వారా ఇక పోలీసులు అప్రమత్తమై మహిళలకు రక్షణ కల్పిస్తారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన దిశ యాప్ పై హోమ్ మంత్రి సుచరిత మీడియా సమావేశం లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్ పై మహిళలకు అవగాహన కల్పించాలని ముఖ్య మంత్రి ఆదేశించారని సుచరిత తెలిపారు.
వాలంటీర్లు పోలీసుల తో రాష్ట్ర వ్యాప్తంగా యాప్ వినియోగంపై ప్రచారం చేస్తామని ఆమె తెలిపారు. అంతేకాదు ఇక ప్రతి నెలా విద్యార్థులకు స్పెషల్ ప్రొటెక్షన్ క్లాసులు సైతం నిర్వహించేందుకు సీఎం ఆదేశించారని హోం మంత్రి సుచరిత తెలిపారు. ఇక పెట్రోలింగ్ చేసే వాహనాల సంఖ్య కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని ఆమె తెలిపారు . ఇటీవల సంచలనం సృష్టించిన సీతా నగరం కేసు గురించి కూడా మాట్లాడారు హోం మంత్రి సుచరిత . అనుమానితులను పట్టుకున్నామని ఇక బాధితురాలు వారిని గుర్తించాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. నిర్మానుష్య ప్రాంతం లో ఇలాంటి ఘటన జరిగిందని.. అలాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆడ పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.