అందరూ గుర్తుంచుకోండి.. ఈ నెలాఖరు వరకే చివరితేదీ?

praveen
నేటి రోజుల్లో మనిషి ఏం చేయాలన్నా ఆధార్ కార్డు తప్పని సరి గా మారి పోయింది. ఎలాంటి కార్యకలాపాలు జరపాలన్న  ఇక ఆధార్ కార్డు   ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం ఆధార్ కార్డ్ అన్ని రకాల కార్యకలాపాలకు ఎంతో కీలకం గా మారి పోయింది. ఈ క్రమం లోనే ఇక మిగితా అన్ని రకాల కార్డు లను కూడా ఆధార్ కార్డు అను సంధానం చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆధార్ కార్డు తో  పాన్ కార్డు అనుసంధానం చేసుకునేందుకు పలు మార్లు సమయం ఇచ్చింది.



 ఇక ఇప్పటికే ఎంతో మంది ఆధార్ కార్డు తో పాన్ కార్డు అనుసంధానం చేసుకోకపోవడం తో సమయాన్ని పొడిగిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల చివరి వరకూ ముగియనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే ప్రతి ఒక్కరు కూడా తమ ఆధార్ కార్డు తో పాన్ కార్డు తో బ్యాంక్ అకౌంట్ తో జత చేసుకోవడం ఎంతో మంచిది. లేదంటే ఎంతో సజావుగా సాగుతున్న బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది.



 అయితే కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా  ఆధార్ కార్డుకు పాన్ కార్డు అనుసంధానం చేసుకోక పోతే పాన్ కార్డు చెల్లదు. ఆ తర్వాత బ్యాంకులో యాభై వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరపడానికి అవకాశం ఉండదు. అంతే కాకుండా అకౌంట్ ఓపెనింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు లాంటి సేవలను కూడా పొందలేరు. అంతే కాదండోయ్ ఆధార్ కార్డు పాన్ కార్డు అనుసంధానం చేసుకోకపోతే అటు ఆదాయపన్ను శాఖ నుంచి భారీగా జరిమానా పడే అవకాశం కూడా ఉంది.  అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుతో తమ పాన్ కార్డును అనుసంధానం చేసుకోవడం ఎంతో ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: