రాహుల్ గాంధీ గురించి ఆసక్తికర విషయాలు ఇవే..!
రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ దంపతులకు పెద్ద కుమారుడైన రాహుల్ గాంధీ 1970, జూన్ 19వ తేదీన న్యూఢిల్లీలో జన్మించారు. పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలో అగంతకులు నుంచి హాని ఉందని అతను చాలా సార్లు తన స్కూల్ చేంజ్ చేశారు. ఆయన తన పాఠశాల విద్యను న్యూఢిల్లీ, డెహ్రాడూన్ లలో పూర్తి చేశారు. నానమ్మ ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత ఆయన తన చెల్లెలతో కలిసి హోమ్ స్కూల్లోనే చదువుకున్నారు. అనంతరం 1989లో ఢిల్లీలోని స్టెఫెన్ కాలేజ్ నుంచి హిస్టరీ సబ్జెక్ట్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా కి వెళ్లారు. అయితే ఆయన తండ్రి రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురికావడంతో రాహుల్ గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. తరువాత ఫ్లోరిడాలోని రోలిన్స్ కళాశాలలో జాయిన్ అయ్యారు.
రాహుల్ గాంధీ జపాన్ యుద్ధ కళ అయిన ఐకోడోలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించారు. అతని కోచ్ సెన్సే పారిటోస్ కార్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి తాను 2009 నుంచి శిక్షణ ఇస్తున్నానని వెల్లడించారు. రాహుల్ కత్తి-పోరాటం, బ్రెజిలియన్ జియు-జిట్సు యుద్ధ కళలలో కూడా శిక్షణ తీసుకున్నారు.
2012లో నిర్భయ సంఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబానికి రాహుల్ గాంధీ అండగా నిలిచారు. నిర్భయ సోదరుడిని బాగా ప్రోత్సాహించి.. పైలట్ శిక్షణా కోర్సును పూర్తి చేయడంలో అతనికి రాహుల్ బాగా సహాయపడ్డారు. ఈ విషయాన్ని నిర్భయ తల్లి ఆశా దేవి మీడియాతో వెల్లడించారు.