వైరల్ వీడియో: వామ్మో.. హోటల్ గల్స్ కి ఇన్ని కష్టాలా?

praveen
నేటి రోజులలో పురుషులు మహిళలు అనే తేడా లేదు అని చెబుతుంటారు అందరు. అయితే  ఇవన్నీ కేవలం ఒట్టి మాటలు అన్నది కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్ధం అవుతుంది.  అయితే అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్న ప్పటికీ ఎంతోమంది మహిళలు ధైర్యంగా మహిళా సాధికారత చాటేందుకు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. ఇలా పట్టుదలతో ఉన్న మహిళలకు అటు మగాళ్ళ నుంచే మళ్లీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం హోటల్ బిజినెస్ లో ఎంతో మంది మహిళలు వివిధ విభాగాల్లో పని చేస్తూ ఉంటారు.




 తమదైన శైలిలో హోటల్ బిజినెస్ లో సేవలు అందిస్తూ వుంటారు. అయితే హోటల్ బిజినెస్ లో చిన్న హోదాలో పని చేస్తూ ఉన్నప్పటికీ ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా పని చేస్తున్న మహిళలు ఎంతో మంది ఇక హౌస్ కీపింగ్ లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి పని చేసిన గర్వంగానే ఫీలవుతుంటారు మహిళలు. ఇక ఇలా హోటల్ బిజినెస్ లో పనిచేస్తున్న ఎంతోమంది మహిళలకు కొన్ని కొన్ని సార్లు కస్టమర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అదెంటో తెలియదు గానీ.. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు పురుషులకు  తాము మగాళ్ళం అన్న విషయం గుర్తుకు వస్తుంది. అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెడతారు.



 ఇక్కడ వీడియోలో మహిళలకు హోటల్ బిజినెస్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నది కళ్ళకు కట్టినట్లు చూపించారు.  ఓ మహిళ హౌస్ కీపింగ్ చేస్తుంటుంది. కస్టమర్ కోసం రూమ్ లో బెడ్ రెడీ చేసింది. అప్పుడే స్నానం చేసి వస్తాడు కస్టమర్. ఇక ఒంటరిగా ఉన్న మహిళలను చూసి తనలోని మగాడు నిద్రలేస్తాడు. దీంతో  అక్కడున్న మహిళలనూ పక్కలోకి రావాలంటూ పిలుస్తాడు. దీని కోసం డబ్బులు కూడా ఇస్తాడు. అయినప్పటికీ తాను అలాంటిదాన్ని కాదని.. తనను వదిలేయాలంటూ చెబుతుంది మహిళ. అయినప్పటికీ వదలడు సదరు నీచుడు.  చివరికి ఎంతో తెలివిగా వ్యవహరించిన ఆ మహిళ ఇక మాటలతో మాయ చేసి సదరు కస్టమర్ ని బాత్రూం లోకి నెట్టి లాక్ వేస్తుంది. ఇక ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇలా మహిళా సాధికారత చాటాలి అనుకున్న మహిళల కు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా.. ధైర్యంతో  ఎదుర్కొంటున్నారు అన్నది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: