
గూగుల్ పే లో చేసిన చిన్న పొరపాటుకు.. 50 వేలు గోవిందా?
రోజురోజుకు ఆన్లైన్ పేమెంట్ యాప్ లలో కూడా ఎంతగానో పోటీ పెరిగి పోతుంది ఇకపోతే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్ యాప్స్ యూస్ చేస్తూనే కార్యకలాపాలు జరుపుతున్నారు. కానీ ఇలాంటి యాప్స్ లో పేమెంట్ జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. ఎందుకంటే ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా చివరికి ఖాతా కాళీ కావాల్సి వస్తుంది. ఇక్కడ ఓ వ్యక్తి చేసిన పొరపాటు ఏకంగా 50వేల రూపాయలు పోగొట్టుకునేలా చేసింది. ఇటీవలే ఓ వ్యక్తి 50 వేల రూపాయలను మరో వ్యక్తికి గూగుల్ పే ద్వారా పంపాలి అని అనుకున్నాడు. కానీ ఇలా పేమెంట్ చేసే సమయంలో అతను చేసిన చిన్న పొరపాటు అతని కొంపముంచింది.
ఏకంగా గూగుల్ పే నుండి పంపే సమయంలో ఒక నెంబర్ తప్పుగా టైప్ చేసినందుకు గాను ఏకంగా 50 వేల రూపాయలు పంపాల్సిన వ్యక్తికి కాకుండా వేరొక వ్యక్తి కి వెళ్ళాయి. దీంతో మళ్లీ ఆ 50,000 చేతికి రాని పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే ఒక హోంగార్డు తన గూగుల్ పే నుంచి ఒక నెంబర్ కి 50,000 పంపాలని అనుకున్నాడు. కానీ పొరపాటున చివరి అంకె తప్పు కొట్టాడు. దీంతో హైదరాబాద్ వ్యక్తికి పోవాల్సిన డబ్బులు కాస్త ఏపీ లో ఉన్న వ్యక్తి కి వెళ్ళిపోయాయ్. అంతే కాదు అతని అకౌంట్ బ్యాంక్ పాత బకాయిల కారణంగా 35,000 కట్ కాగా ఇక పదిహేను వేలు మాత్రమే మిగిలాయి. అయితే తనకు పూర్తి డబ్బు మళ్లీ తిరిగి వచ్చేలా చూడాలి అంటు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు సదరు హోంగార్డు.