భార్యకు పిల్లలు కలగలేదని భర్త రెండో పెళ్లి.. కానీ చివరికి?
ఇక్కడ ఓ యువకుడికి ఇలాంటి అనుభవం ఎదురైంది పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్ట లేదు. దీంతో ఇక రెండో పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు ఆ యువకుడు మొదటి భార్య ఇష్టంతోనే మరో యువతి మెడలో తాళి కట్టాడు. కానీ విధి అప్పటికి అతన్ని చిన్నచూపు చూసింది. రెండో భార్యకు కూడా పిల్లలు కాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు చివరికి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఓ యువకుడు నదిలో దూకాడు అన్న విషయం తెలుసుకున్న పోలీసులు బ్యారేజ్ వద్దకు చేరుకొని యువకున్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఇక అతని ఫోన్ ఆధారంగా అతను గుంటూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు సదరు వ్యక్తి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కుమారి కుమారుడు మహంకాళి గా పోలీసులు గుర్తించారు రెండేళ్ల కిందట మహంకాళి కి పెళ్లి జరుగగా పిల్లలు కాలేదు దీంతో సదరు వ్యక్తి మొదటి భార్య అనుమతితో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యకు కూడా పిల్లలు కాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు తెలిపింది. ఇక ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.