కొవిడ్ టైమ్‌లోనూ ఆగ‌ని అవినీతి ఫిర్యాదులు..?

Suma Kallamadi
ప్ర‌స్తుత రోజుల్లో ఏ ప‌నికైనా స‌రే అవినీతి అనేది కామ‌న్ అయిపోయింది. లంచం లేనిదే ఏ ప‌నీ జ‌ర‌గ‌దు. ఇప్పుడే కాదు ఎప్ప‌టి నుంచో మ‌న ప్ర‌భుత్వ ఆఫీసుల్లో ప‌నితీరు ఇలాగే ఉంటోంది. మ‌రి అంతలా లంచాల‌కు అల‌వాటు ప‌డ్డారు మ‌న ఆఫీస‌ర్లు. ఎవ‌రు వ‌చ్చినా స‌రే వారు మాత్రం మార‌రు. ఇప్ప‌టికే ఎంతో మందిపై కొర‌డా ప‌డ్డ‌ప్ప‌టికీ వారి తీరు ఇంచు మార్పు కూడా లేదంటే వారు ఎంత‌లా అల‌వాటు ప‌డ్డారో అర్థం చేసుకోవ‌చ్చు.

జ‌నాలు కూడా వారి లంచాల‌కు నిజంగానే అల‌వాటు ప‌డిపోయారు. వారిపై పెద్ద‌గా ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌ట్లేదు. అయితే ఎక్కడో చోట కొంద‌రు మాత్ర‌మే కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇక ఏసీబీ వారు కూడా అనేక చ‌ర్య‌లు తీసుకుంటూనే ఉన్నారు. లంచం తీసుకుంటూ దొర‌కిన వారిపై ఎన్నోసార్లు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కొంద‌రిన స‌స్పెండ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రికైతే జైలు శిక్ష‌కూడా ప‌డుతోంది.

ఇక ఇప్పుడు క‌రోనా సెకండ్‌ వేవ్ ను క‌ట్ట‌డి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అయితే ప్రజలకు అత్యవసర సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రభుత్వ ఆఫీసుల్లో పరిమిత సం ఖ్యలో అధికారులు, సిబ్బంది ప‌నిచేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది ప్ర‌బుత్వం. ఇదిలా ఉంటే లంచాలకు అలవాటు తిమింగ‌ళాలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా త‌మ పని చేస్తున్నారు.

ఎవ‌రు వ‌చ్చి ప‌ని కావాలన్నా పైసలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారంట ఈ అవినీతి అధికారులు. దీంతో చాలా మంది బాధితులు ఈ అధికారుల అవినీతిపై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇలా త‌మ‌కు అందుతున్న అవినీతి ఫిర్యాదులపై అధికారులు కూడా బాగానే ఆధారాలు సేకరిస్తున్నార‌ని స‌మాచారం. ప్రభుత్వ ఆఫీస‌ర్లు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబరు 1064 కు కంప్లైంట్లు చేయాల‌ని పై అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: