ఆ పథకం దరఖాస్తుకు నేడే చివరి తేదీ.. త్వరపడండి?

praveen
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగింది.  అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారు సీఎం జగన్.  అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా జగన్ పథకాలు ప్రవేశపెట్టారు అన్నది తెలిసిందే.  ఈ క్రమంలోనే అటు డ్రైవర్ల అందరికీ కూడా ఎంతో ప్రయోజనం చేకూరాలి అనే ఉద్దేశంతో.. ఎక్కడ ఆర్థిక ఇబ్బందులతో బాధపడకూడదు అని భావించి ఇక ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు వాహనమిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.

 ఈ పథకంలో భాగంగా అర్హులైన వారందరికీ కూడా ప్రతి ఏటా పది వేల రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.  అయితే ఇక వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నిన్నటివరకు మాత్రమే చివరి తేదీ ఉంది. కానీ నిన్న సర్వర్లో ప్రాబ్లం ఉన్న కారణంగా ఈ గడువును పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనమిత్ర పథకానికి ఇప్పటికే ఎంతోమంది దరఖాస్తు చేసుకున్నారు. ఆటో,రిక్షా, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులుగా అటు ప్రభుత్వం నిర్ణయించింది.

 అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనమిత్ర పథకానికి ఇప్పటికి కూడా ఎంతో మంది వివిధ కారణాల దృశ్య దరఖాస్తు చేసుకోలేదు. కాగా నిన్న చివరితేదీ కావడంతో ఇక ఎంతో మంది ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సర్వర్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ఇక నిన్న సర్వర్లో సాంకేతిక సమస్యలు రావడం తో ఎంతో మంది పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. దీంతో నిరాశ లో మునిగిపోయారు. ఇలాంటి తరుణంలో సర్వర్ లో  ప్రాబ్లమ్స్ రావడం కారణంగా నేడు కూడా వాహన మిత్ర ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.  ఇప్పటివరకు వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు కూడా అప్లై చేసుకోవచ్చు. వాహనం ఫోటోతో ఇక వాలంటీర్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: