గుడ్ న్యూస్: భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

Suma Kallamadi
ఇండియాలో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీని దెబ్బ‌కు రోజుకు ల‌క్ష‌ల్లో కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇటు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. వ‌రుస‌గా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ పెట్ట‌డంతో కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్న కేసులు లాక్‌డౌన్ దెబ్బ‌కు ఒక్క‌సారిగా త‌గ్గుతున్నాయి.

దాదాపు 63 రోజుల త‌ర్వాత దేశంలో సోమ‌వారం కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ఏకంగా ల‌క్ష దిగువ‌కు క‌రోనా కేసులు చేరుకున్నాయి. ఇక్క‌డ అస‌లు ట్విస్టు ఏంటంటే దేశంలో క‌రోనా టెస్టుల సంఖ్య కూడా భారీగా త‌గ్గ‌డంతో కేసుల సంఖ్య త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌యింద‌ని తెలుస్తోంది. సోమ‌వారంకు ముందు రోజుకు 35.7 ల‌క్ష‌ల టెస్టులు దేశ‌వ్యాప్తంగా చేయ‌గా.. సోమ‌వారం మాత్రం ఇందుకు భిన్నంగా కేవ‌లం 15.9 ల‌క్ష‌లు మాత్ర‌మే చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో కేస‌లు త‌గ్గిపోయాయి. సోమవారం పాజిటివిటీ రేటు 5.4 శాతానికి చేరింద‌ని అధికారులు తెలిపారు. ఆదివారం ఇదే పాజిటివ్ రేటు కేవలం 2.8 శాతంగా ఉంది. ఇక సోమవారం దేశంలో మొత్తం 86,498 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారులు తెలిపారు. అయితే 2123 మంది చ‌నిపోవ‌డం కంగారు పెడుతోంది. చివరిసారిగా రెండు నెల‌ల క్రితం ఏప్రిల్ 5వ తేదీన దేశంలో ల‌క్షలోపు క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

ఈ సెకండ్ వేవ్‌ లో మ‌న ఇండియాలో అత్య‌ధికంగా మే 6న 4,14,554 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో అత్య‌ధికంగా ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడులోనే 19,448 కేసులు న‌మోదు అయిన‌ట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఆ త‌ర్వాతి స్థానాలల్లో క‌ర్ణాట‌క 11,958 క‌రోనా కేసులు, మ‌హారాష్ట్ర 10,219 క‌రోనా కేసుల‌తో ఉన్నాయ‌ని అధికారులు వివ‌రిస్తున్నారు. అయితే ఇన్ని రోజుల త‌ర్వా త దిగ‌వ కేసులు రావ‌డంతో కొంత ఊర‌ట‌నిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇంత తక్కువగా కేసులు రావ‌డం మంచిదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: