బైడెన్ చైనా మనిషి అనుకుంటే.. డ్రాగన్ కే షాక్ ఇచ్చాడేంటి?

praveen
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి రావడం.. ప్రపంచ వ్యాప్తంగా పాకి పోవడం జరిగింది. మొదటి నుంచి చైనా భావజాలంపై విరుచుకుపడిన ట్రంప్ కరోనా వైరస్ పాకి పోవడంతో వైరస్ కు చైనీస్ వైరస్ అంటూ పేరు పెట్టి దారుణంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు.  కాగా గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓటమిపాలై ఇక అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు జో బైడెన్ .  అయితే మొదటి నుంచి చైనా భావజాలం పట్ల సానుకూలత ఉన్న జో బైడెన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా తో మంచి సంబంధాలు కొనసాగించే అవకాశం ఉంది అని భావించారు అందరు.



 ముఖ్యంగా భారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జో బైడెన్ చైనా కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది అని భావించారు. అయితే అధ్యక్ష పదవి లోకి వచ్చినప్పటినుండి కాస్త సైలెంట్ గానే వుంటూ వచ్చారు జో బైడెన్.  దీంతో జో బైడెన్ చైనా మనిషి అంటూ ఎంతో మంది అనుకోవడం ప్రారంభించారు.  ఇలాంటి నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు జో బైడెన్. ఇటీవలె మీడియాతో మాట్లాడిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాకి పోయేలా చేసి భారీ నష్టాన్ని చైనా కలగ చేసిందని.. ఆ నష్టాన్ని మొత్తం చైనా నుంచే భర్తీ చేయాలి అంటూ వ్యాఖ్యానించారు.



 ఇక ఇప్పుడు జో బైడెన్ కూడా చైనాకు వ్యతిరేకంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.  చైనా కు సంబంధించిన కంపెనీలపై జో బైడెన్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. 59 చైనీస్ డిఫెన్స్ అండ్ టెక్ కంపెనీలపై నిషేధం విధిస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా కు ఊహించని షాక్ తగిలింది. అయితే ఇప్పటికే ట్రంప్ చైనా తీరుపై విమర్శలు చేస్తూ ప్రపంచదేశాలను ఆకర్షిస్తున్నారూ.. ఈ నేపథ్యంలో ఇప్పటికికూడా జో బైడెన్ సైలెంట్ గా ఉంటే నెగిటివిటీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది భావించి ఇలాంటి చర్యలకు జో బైడెన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: