1500 కోట్లు.. 30 కోట్ల వ్యాక్సిన్లు.. మోదీ రెడీ?

praveen
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్  ప్రక్రియ శర వేగంగా జరుగుతుంది. ఎక్కడ టీకాలు కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది  అయితే ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతుండటం..  ఇక రూపాంతరం చెందుతున్న వైరస్ మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుండటంతో.. అందరికీ వ్యాక్సిన్ అందించడం కీలకం గా మారి పోయింది. దీంతో అందరికీ వ్యాక్సిన్ అందించే దిశగా  అడుగులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో దేశంలో థర్డ్ వేవ్ కూడా రాబోతుందని అటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆలోగానే దేశం లో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని భావిస్తోంది  కేంద్ర ప్రభుత్వం.



 ఈ క్రమం లోనే సామర్థ్యానికి మించి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయాలి అంటూ ప్రస్తుతం టీకాలు ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్  కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన ప్రోత్సాహకాలను కూడా అందించారు. అయితే కేవలం ఈ రెండు కంపెనీల మీద ఆధార పడకుండా మరిన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. హైదరాబాదుకు చెందిన 'బయోలాజికల్- ఈ' సంస్థతో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు  ఒప్పందం కుదుర్చుకుంది కేంద్ర ప్రభుత్వం.



 కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా 30 కోట్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి ఇచ్చినందుకు పదిహేను వందల కోట్ల రూపాయల చెల్లించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.  అయితే పదిహేను వందల కోట్ల రూపాయలను ముందస్తుగా చెల్లించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే 1,2 దశలకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది సంస్థ. ఇలా దేశంలో ఏర్పడిన వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఇది ఒక కీలకమైన దశ గా భావిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: