కేసులు తగ్గుతున్నాయ్.. కానీ సరిహద్దులు బయపెడుతున్నాయ్?
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన ఆంక్షలతో కరోనా వైరస్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటికి మొన్న 25 వేలకు పైగా కరోనా కేసులు ఉండగా క్రమక్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఓవైపు కరోనా వైరస్ కేసులు సంఖ్య తగ్గడమే కాదు మరోవైపు రికవరీ రేటు కూడా పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో.. ఏపీలో 11421 కొత్త పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.. అయితే కరోనా మంచి కోరుకున్న వారి సంఖ్య 16223 గా ఉంది. ఇలా కరోనా కేసులు కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయి.
కానీ మరణాల సంఖ్యలో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఓవైపు కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ అటు సరిహద్దు జిల్లాలు మాత్రం భయపెడుతున్నాయి. తమిళనాడు సరిహద్దు జిల్లా అయిన చిత్తూరులో 13 కరోనా మరణాలు ఉండగా.. కర్ణాటక సరిహద్దు జిల్లా అనంతపురం జిల్లాలో తొమ్మిది మంది వైరస్ బారినపడి చనిపోయారు. ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళంలో ఎనిమిది మంది.. ఇక పక్క జిల్లా విజయనగరంలో ఏడుగురు.. యానాం సరిహద్దుల్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు.. నెల్లూరులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, కృష్ణాజిల్లాలో 5 గురు.. ప్రకాశంలో 5 గురు మరణించారు.. ఇలా ఏపీ సరిహద్దుల్లో కరోనా మరణాలు భయపెడుతున్నాయి.