పాక్ నుంచి విముక్తి పొందిన తెలుగు ప్రేమికుడు..
పాకిస్తాన్ భూ భాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి, జైలులో పెట్టారు. ప్రశాంత్‌ను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చిన వెంటనే, ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని భారత్ కోరింది. సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో పోలీసులు తెలిపారు. దాదాపు నాలుగేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు సోమవారం అప్పగించడం జరిగింది.
ఇక మన తెలుగు యువకుడు ప్రశాంత్ ఇంటికి చేరుకోవడంతో అతని కుటుంబం ఆనందంలో మునిగితేలింది. 2019లో తన కుమారుడిని రప్పించే ప్రయత్నం చేయాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను ప్రశాంత్ తండ్రి బాబురావు కలవడం జరిగింది. ఇక ప్రశాంత్ పాకిస్తాన్ నుంచి విడుదలయ్యి తిరిగి రావడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.