సుశాంత్ కేసు మరోసారి తెర మీదికి.. కీలక వ్యక్తి అరెస్ట్?

praveen
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. ఎన్నో  ఒత్తిళ్ళను,సమస్యలను తట్టుకుని ఒక సీరియల్ నటుడు స్థాయి నుంచి బాలీవుడ్ లో మంచి హీరో స్థాయికి ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వరుస అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా మారిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్పుత్.  ఇలా కెరియర్ విజయవంతంగా దూసుకుపోతున్న సమయంలో ఒక్కసారిగా సుశాంత్ తన ఫ్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ అయ్యేలా చేసింది.



 ఇక సుశాంత్ మరణానికి బాలీవుడ్లోని ఎంతోమంది పెద్దలే కారణం అంటూ ఎన్నో ఆరోపణలు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇక సుశాంత్ కేసులో ఎంతోమందినీ అరెస్టు చేసి ఇక విచారణ కూడా జరిపారు పోలీసులు. ముఖ్యంగా ఇక ఎన్నో రోజుల పాటు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్  రియా చక్రవర్తి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. అయితే ప్రస్తుతం సుశాంత్ సింగ్ కేసు విషయం పూర్తిగా కనుమరుగయ్యింది అనుకుంటున్న తరుణంలో.. ఇటీవల మరోసారి సుశాంత్ ఆత్మహత్య కేసు తెరమీదికి వచ్చి సంచలనం గా మారిపోయింది.



 దివంగత నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కీలక వ్యక్తిని అరెస్టు చేశారు ఎన్సిబి పోలీసులు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పితానిని హైదరాబాద్ లో అరెస్టు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో కలిసి సిద్ధార్థ్ మూడేళ్ల పాటు ఒకటే ఫ్లాట్ లో కలిసి ఉన్నాడు.. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో ఇక అటు సిద్ధార్థ్ ని కూడా పలుమార్లు విచారణ జరిపారు పోలీసులు. ఇక సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు చివరిసారిగా సుశాంత్ సిద్ధార్థ కి కాల్ చేసి మాట్లాడాడు. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు సుశాంత్ పర్సనల్ మేనేజర్ గా కూడా పనిచేసాడు సిద్ధార్థ్. అయితే ప్రస్తుతం సిద్ధార్థ ని అరెస్టు చేసి ఎలాంటి విచారణ జరపనున్నారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: