ఆ టైమ్ లో డిప్రెషన్లోకి వెళ్లి పోయా : శ్రీముఖి
ఇక ఆ తర్వాత తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరిని ఆకర్షించే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది శ్రీముఖి. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుని తెలుగు ప్రేక్షకుల హృదయాలను దగ్గర అయింది. చివరికి బిగ్ బాస్ లో లాస్ట్ వరకు కొనసాగుతూ బిగ్బాస్ రన్నరప్గా నిలిచింది శ్రీముఖి. ఇకపోతే సాధారణంగా సినీ సెలబ్రిటీలు కొన్ని కొన్ని సార్లు డిప్రెషన్ లోకి వెళ్ళి పోతూ ఉంటారు. అయితే తన జీవితంలో కూడా అలాంటి చేదు అనుభవం ఉంది అంటూ చెప్పుకొచ్చింది యాంకర్ శ్రీముఖి.
ఇటీవలే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన శ్రీముఖి.. మీరు ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్లారా అంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో తాను డిప్రెషన్లోకి వెళ్లి పోయాను అని.. ఆ తర్వాత డిప్రెషన్ నుండి బయటపడటానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపింది.. కానీ మనోధైర్యంతో డిప్రెషన్ నుంచి బయటపడ గలిగాను అంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది.. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే అంతా బాగుంటుంది అంటూ శ్రీముఖి తెలిపింది. అయితే తాను డిప్రెషన్లోకి వెళ్లి పోవడానికి అసలు కారణం ఏంటి అన్న విషయాన్ని మాత్రం శ్రీముఖి వెల్లడించలేదు.