సెకండ్ డోస్ ఆలస్యం అయితే.?

Suma Kallamadi
కరోనా వైరస్ వ్యాప్తి అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఒక పక్క వాక్సిన్ వచ్చినాగాని కరోనా అనేది తగ్గడం లేదు. అయితే మొదట్లో వాక్సిన్ వేయించుకోమని ప్రభుత్వాలు ప్రజల్ని కోరిన, వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ప్రజలు వాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అత్యంత భయంకరంగా మరి ప్రజల ప్రాణాల్ని బలితీసుకుంటుంది. దీనితో ప్రజలు వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం మనకి అందుబాటులో రెండు రకాల వాక్సిన్లు ఉన్నాయి. ఒకటి కోవాక్సిన్, రెండోది కోవి షీల్డ్. ఈ రెండు వాక్సిన్లు రెండు డొసేజెస్ లో ఇస్తున్నారు. అయితే తొలి డోసు ఇచ్చిన తర్వాత సెకండ్ డోస్ ను ఆలస్యంగా వేయించుకుంటే ఎక్కువ సంఖ్యలో యాంటీ బాడీస్ శరీరంలో ఉత్పత్తి అవుతాయని ఓ స్టడీలో తేలింది.


 శరీరంలో యాంటీ బాడీస్ తయారు అయ్యి అవి  పరిపక్వత చెందేందుకు ఫస్ట్ డోస్ కి రెండవ డోస్ కి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వాలని ప్రముఖ నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రెండో డోస్ ఇచ్చే ముందు మన శరీరంలో 20 నుంచి 300 శాతం వరకు అధికంగా యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని ఒక కొత్త పరిశోధనలో తేలింది.రెండు డోసుల మధ్య దూరం విషయంలో అన్ని వ్యాక్సిన్ లు మంచి ప్రభావవంతమైన ఫలితాలను చూపిస్తున్నాయని సమాచారం.


అయితే మొదటి డోస్ వేసుకున్నాక ఒకవేళ ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వస్తే తర్వాత రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.మన. భారత్ లో కరోనా నుంచి కోలుకున్న వారికి ఇచ్చే వ్యాక్సిన్ ఒక డోసుకు మరో డోసుకు మధ్య 90 రోజుల వ్యవధిని నిర్ణయించారు.అంటే మొదటి డోస్ వేసుకున్నాక రెండవ డోస్ 90 రోజులు అయ్యాక వేసుకోవాలి అని.అదే విదేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్న ఆస్ట్రా జెనెకా టీకాకు కుడా రెండు డోసుల మధ్య అంతరం 12 వారాలు అంటే మూడు నెలలుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: