ప్రజల ప్రాణాలతో డాక్టర్ల నిలువుదోపిడి..
కరోనా వ్యాక్సిన్లను వృథా చేయొద్దని, బ్లాక్ మార్కెట్లకు తరలించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, కొందరు రెమిడిసివర్ ఇంజెక్షన్‌ను అక్రమంగా విక్రయిస్తున్నారు.ఈ ఇంజక్షన్ లు సాధారణంగా 2 నుంచి 3 వేలు లోపు అమ్ముడుపోతాయి. కాని డాక్టర్లు పేషెంట్స్ కి నానా సాకులు చెప్పి 20,30 వేలు రేటు చెప్పి దోపిడీ చేస్తున్నారు.ఇక ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు లక్షల్లోకి పోయింది. ఇక కొంచెం ఆర్ధిక స్థోమత ఎక్కువుగా వున్న వారి దగ్గర డాక్టర్ బాబుల దోపిడీ మాములుగా లేదనే చెప్పాలి.
ఇది పెద్ద పెద్ద హాస్పిటల్ లో జరుగుతుంది.ఇక డాక్టర్ దోపిడీ దారులు ముఖ్యంగా రెండు ఇంజక్షన్ లను సిఫారసు చేస్తున్నారు. ఒకటి tocilizumab కాగా రెండోది bevacizumab. మాములుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరని బట్టి చూస్తే ఇవి 45000/- రూపాయలు ఉంటాయి. కాని డాక్టర్లు నానా సాకులు చెప్పి వీటిని 5-7 లక్షలకు అమ్మి దోపిడీ చేస్తున్నారు. చేశారు కూడా. అయితే ఈ ఇంజక్షన్ల వల్ల కొంతమంది బ్రతికారు, కొంతమంది చనిపోయారు కాని ఈ డాక్టర్ల దోపిడీ మాత్రం చావడం లేదు. ఈ రకంగా మన దేశ డాక్టర్ బాబులు ప్రజలను వారి ప్రాణాలతో ఆడుకుంటూ నిలువుదోపిడి చేస్తున్నారు.