కరోనా వేళ మరోసారి అండగా నిలిచిన రిలయన్స్..

Purushottham Vinay
కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేస్తుంది. రోజు రోజుకి చాప కింద నీరు లాగా దేశం నలు మూలలా వ్యాపిస్తుంది. అందరిని కాటేస్తూ బలి తీసుకుంటుంది. రోజుకి దాదాపు 4 లక్షల దాకా కేసులు నమోదవుతున్నాయంటే కరోనా ఉధృతి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇక కరోనా రోగుల కొరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేక సేవా కార్య క్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పటి లాగే తన సేవా గుణాన్ని మరోసారి బయట పెట్టింది.కరోనా విపరీతంగా విజృంభిస్తున్న ఈ సమయంలో అత్యవసర వైద్య సేవ కోసం, వైద్య వాహనాలకు అన్ని రిలయన్స్ పెట్రోలియం రిటైల్ అవుట్లెట్లు అలాగే అత్యవసర అంబులెన్సులను తెలుగు రాష్ట్రాలకు అందిస్తుంది. అలాగే ఆ ఆంబులెన్స్ లకి ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించడం జరిగింది.ఇది జూన్ 30 వరకు వర్తిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపడం జరిగింది.


సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అధికార లేఖను అందించే అన్ని అత్యవసర సేవా వాహనాలకు రిలయన్స్ పెట్రోల్ పంపులు రోజుకు గరిష్టంగా 50 లీటర్ల వరకు పెట్రోల్ ఇవ్వటానికి రిలయన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కో రాష్టానికి చెరో 80 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ రిలయన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇక ఇండియన్ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఈ కంటైనర్లను ఆర్‌ఐఎల్ జామ్‌నగర్ ప్లాంట్ నుండి రవాణా చేయడం జరిగింది.అంతేగాక రిలయన్స్ ఫౌండేషన్ మిషన్ అన్నా సేవాను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి కార్పొరేట్ ఫౌండేషన్ చేపట్టిన అతిపెద్ద భోజన పంపిణీ కార్యక్రమం. రిలయన్స్ ఫౌండేషన్ దాదాపు 200 మంది భాగస్వాముల ద్వారా కిరాణా కిట్లు మరియు వండిన భోజనం అలాగే బల్క్ రేషన్లను సరఫరా చేస్తోంది. ఇంకా ఇప్పటివరకు 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని అండర్ రిసోర్స్డ్ ఇంకా ఫ్రంట్ లైన్ కార్మికులకు 5.5 కోట్లకు పైగా భోజనం అందించి ఇలా ఎప్పటికప్పుడు తన సేవా గుణాన్ని చాటుకుంటుంది రిలయన్స్ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: