రూ .100కే కోవిడ్ టెస్ట్..?

Suma Kallamadi
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కరోనా అనే పేరు వింటే చాలు బయపడి పోతున్నారు. పక్క వాళ్ళతో మాట్లాడాలంటే చాలు వణికిపోతున్నారు.ఎందుకంటే కరోనా వైరస్ ఎవరికి ఉందో తెలియదు కాబట్టి. ఎవరైనా దగ్గినా తుమ్మినా గాని హడలెత్తిపోతున్నారు.ఎటువంటి లక్షణాలు కనపడిన గాని హాస్పిటల్ కి పరుగులుపెట్టి కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. ఎంత డబ్బు అయినాసరే లెక్క చేయడం లేదు. అయితే డబ్బులు ఉన్నవాళ్లు లెక్కచేయడం లేదు. కానీ డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి. వాళ్ళు ఖర్చుపెట్టలేరు కదా. అయితే ఇప్పుడు అలాంటివారి కోసమే ముంబై బెస్ట్ స్టార్టప్ ఫార్మా కంపనీ అతి తక్కువ ధరకే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. కోవిడ్ 19 డయాగ్నోసిస్ అండ్ సర్వేఇల్లాన్స్ కేవలం వంద రూపాయలకే కోవిడ్ టెస్ట్ చేయనున్నారు.


పతాంజలి ఫార్మా సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఐఐటీ ముంబై తో పాటుగా దీనిని ప్రారంభించనున్నారు.దీని కోసం గాను 75 లక్షల రూపాయలు ఫండింగ్ సపోర్ట్ అండ్ 75 లక్షలు సాఫ్ట్ లోన్ కూడా లభించింది. The Centre for Augmenting war with COVID-19 health Crisis (CAWACH ), Department of Science and technology (DST), ఈ స్టార్టప్ ని జూలై 2020 నా సపోర్ట్ చేయడం జరిగింది.రాపిడ్ యాంటీబాడీ అండ్  యాంటిజం పరీక్షలను 8 నుండి 9 నెలల్లో మనముందుకు తీసుకొచ్చారు.


అంతేకాకుండా పతంజలి ఫార్మా కంపనీ, ఆర్ ఎండ్ డీ ల్యాబ్స్ వాళ్ళ టీం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ని అభివృద్ధి చేస్తోంది అని డాక్టర్ వినయ్ సైని తెలిపారు. అలాగే ఇప్పుడు మనకి అందుబాటులోకి  వచ్చే ఈ రాపిడ్ covid-19 test కిట్ కూడా కేవలం 10 నుండి 15 నిమిషాల్లో టెస్ట్ చేసుకుని రిసల్ట్ పొందవచ్చని తెలిపింది. హాస్పిటల్ సౌకర్యాలు లేని పల్లెటూర్లలో సైతం ఈ కిట్ బాగా ఉపయోగపడుతుంది అని వెల్లడించారు.అంతేకాకుండా ఈ టెస్ట్ కోసం వేలు ఖర్చుపెట్టాలిసిన పని లేదు. చాలా తక్కువ ధరకే అందరికి అందుబాటులో ఉంటుంది.ఈ విపత్కర పరిస్థితులలో ఈ కిట్ వల్ల కరోనా వైరస్ ను త్వరగా గుర్తించవచ్చని అన్నారు. ప్రస్తుతం రాపిడ్ covid19 యాంటీబాడీ టెస్ట్ జరుగుతోందన్నారు. అది కూడా సక్సెస్ అయితే త్వరలోనే అతి తక్కువ ధరకి కరోనా టెస్ట్ కిట్ లభ్యం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: