ఆ రాష్ట్రలకు కోవ్యాక్జిన్ పంపిణీ...
18 రాష్ట్రాలకు తాము కోవ్యాగ్జిన్ సరఫరా చేస్తున్నామని.. తాము కంటిన్యూస్ గా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామంటూ దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటిక్ సంస్థ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేసింది.భారత్ బయోటెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గడ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, త్రిపుర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని తెలపడం జరిగింది....
ఏప్రిల్ 29 న, భారత్ బయోటెక్ రాష్ట్రాల కోవాక్సిన్ ధరను మునుపటి రూ.600 నుండి రూ.400లకు తగ్గించినట్లు ప్రకటించింది. ఇది కోవాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రూ.150కే అందిస్తోంది.ఇక సెంట్రల్ గవర్నమెంట్ నియమాల ప్రకారం ఆ సంస్థలు వ్యాక్సిన్ లు పంపిణీ చెయ్యబోతున్నాయి. అంటే ఇప్పుడు పంపించే వ్యాక్సిన్లు 45 సంవత్సరాలు దాటిన వారికి ఇస్తున్నారని సమాచారం.