
అక్కడ టీడీపీ ఇలా.. వైసీపీ అలా.. అంతా అస్తవ్యస్తం..!
నిజానికి జిల్లాలో కొందరు కొత్తవారికి అవకాశం లభించింది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, ఆర్థర్, కంగాటి శ్రీదేవి వంటివారు తొలిసారి ఎన్నికయ్యారు. అయితే.. వీరు కూడా ప్రజల్లో తిరగడం లేదనేది వాస్త వం. ఇక, డోన్, శ్రీశైలం సహా పలు నియోజకవర్గాల్లో సీనియర్లు గెలిచినా.. మంత్రి బుగ్గన కేబినెట్లో బిజీగా ఉండడంతో నియోజకవర్గానికి అందుబాటులో ఉండడం లేదనే టాక్ ఉంది. ఇక, మిగిలిన వారు ఆధిప త్యం కోసం.. పదవుల కోసం పోరాటాలు చేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒక సామాజిక వర్గానికే చెందిన నేతలు.. ఆధిపత్య పోరులో తలమునకలవుతున్నారు.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. నడిపించేవారు లేక.. పార్టీ సతమతమవుతోంది. ఉన్నవారిలోనూ.. నైరాశ్యం ఏర్పడింది. భూమా అఖిల వంటి నాయకురాలు.. దూకుడుగా ఉన్నప్పటికీ.. ప్రయోజనం మాత్రం కనిపిం చడం లేదు. ఇక, కోట, కేఈ కుటుంబాలు గత ఎన్నికల్లో కలిసి ముందుకు సాగినప్పటికీ.. కొన్నాళ్లుగా మళ్లీ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక, మరికొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీతో టీడీపీ నేతలు చేతులు కలిపారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు కూడా కనిపించడం లేదు. ఇలా.. రెండు పార్టీలూ కూడా ఎన్నికలు ఇప్పట్లో లేవు కదా? అనే ధోరణిలో వ్యవహరిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.