అనుకున్నదే జరిగింది.. కరోనా ఒక ఆయుధమేనట?

praveen
ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తోంది మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారి వైరస్ పేరేత్తితే చాలు ప్రపంచ ప్రజానీకం మొత్తం వణికి పోతుంది. ఇలా గత ఏడాది చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం అల్లకల్లోలం చేసింది.  ఇక ఈ వైరస్ కు సంబంధించిన ఎన్నో విషయాలను దాచి పెట్టి మారణహోమం సృష్టించింది చైనా. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అప్రమత్తం కావడంతో ఈ మహమ్మారి మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుందని అంతేకాకుండా ప్రాణాలను సైతం తీస్తుంది అన్న విషయాలు తెలుసుకున్నార.  కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది లక్షలసంఖ్యలో జనాలు వైరస్ బారినపడి మృతి చెందారు.



 అయితే గత ఏడాది అధికారంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు వైరస్ ముమ్మాటికీ చైనీస్ వైరస్ అంటూ పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే రోజురోజుకూ వెలుగులోకి వస్తున్న ఘటనలు ఇది నిజమే అని నిరూపిస్తూనే ఉన్నాయి. ఊహన్ నగరం లో  వైరస్ పుట్టుక వెనుక ఏదో రహస్యం దాగి ఉంది అని ఇప్పటికే ఎంతో మంది శాస్త్రవేత్తలు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు ఇక ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ వార్తా సంస్థ ప్రచురించిన కథనం మాత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. 2015 సంవత్సరంలో చైనా శాస్త్రవేత్తలు రాసిన రీసెర్చ్ డాక్యుమెంట్లు ఇటీవల వీకెండ్ ఆస్ట్రేలియా అనే వార్త పత్రిక బయటపెట్టింది



 కరోనా వైరస్ ను జీవాయుధం గా మార్చేందుకు అటు చైనా ప్రయత్నించిందని అందుకే 2015 లోనే దీనికి సంబంధించిన పరిశోధనలు  మొదలు పెట్టింది అని ఈ వార్తలో తెలిపింది. అందుకే ఇతర దేశాలు పరిశోధకులు ఊహన్ లో పరిశోధనలు చేస్తామంటే ఒప్పుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది అయితే ఇటీవలే ఆస్ట్రేలియా వార్తా పత్రిక ప్రచురించిన కథనం మాత్రం సంచలనంగా  మారిపోయింది. గతంలో పలువురు చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ద్వారా శత్రుదేశాల వైద్య ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతోనే ఇలా కరోనా వైరస్ ని  చైనా తీసుకు వచ్చింది అంటూ ఆస్ట్రేలియా పత్రిక కథనం ప్రచురించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: