గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి బంపరాఫర్..!

Suma Kallamadi
ఎల్పీజీ బుకింగ్, చెల్లింపుపై సామాన్యులకు భారాన్ని తగ్గించడానికి, పేటీఎం మరోసారి తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు 9 రూపాయలతో 809 రూపాయల (ప్రస్తుతం గ్యాస్ ధర) విలువ చేసే గ్యాస్ సిలిండర్ పొందవచ్చు. ఈ ఆఫర్ పేటీఎం క్యాష్ బ్యాక్ కింద లభిస్తుంది.


మీరు కూడా పేటీఎం ఆఫర్‌ను వినియోగించుకోవాలనుకుంటే, మీకు అలా చేయడానికి 2021 మే 31 వరకు అవకాశం ఉంది. ఈ ఆఫర్‌ మొదటిసారి ఎల్పీజీ సిలిండర్ ను బుక్ చేసుకుని పేటీఎంతో సొమ్ము చెల్లించే వినియోగదారులకు మాత్రమే. మీరు పేటీఎం సిలిండర్ కోసం బుక్ చేసి చెల్లించినప్పుడు, మీకు ఆఫర్ కింద స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది, దీని క్యాష్‌బ్యాక్ విలువ 800 రూపాయలు.



ఈ ఆఫర్ మొదటి పేటీఎం సిలిండర్ బుకింగ్‌పై వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్ కోసం, మీరు బిల్ చెల్లింపు తర్వాత మీకు లభించే స్క్రాచ్ కార్డును ఓపెన్ చేయాలి. క్యాష్‌బ్యాక్ మొత్తం రూ.10 నుండి 800 రూపాయల వరకు ఉంటుంది. మీరు ఈ స్క్రాచ్ కార్డును 7 రోజుల్లో ఉపయోగించాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు దాన్ని ఉపయోగించుకోలేరు.



మీరు ఈ ఆఫర్‌ను కోసం మొదట మీరు మీ మొబైల్ ఫోన్‌లో పేటీఎం యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తరువాత, మీ గ్యాస్ ఏజెన్సీతో సిలిండర్ బుకింగ్ చేయవలసి ఉంటుంది. దీని కోసం, పేటీఎం యాప్ లో ‘మరిన్ని చూపించు’ ఆప్షన్ కు వెళ్లి క్లిక్ చేసి, ఆపై రీఛార్జ్ అలాగే పే బిల్లులపై క్లిక్ చేయండి. దీని తరువాత, మీరు సిలిండర్ బుక్ చేసే ఎంపికను చూస్తారు. ఇక్కడ, మీ గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోండి.



బుకింగ్ చేయడానికి ముందు, మీరు ‘FIRSTLPG’ ప్రోమో కోడ్‌ను నమోదు చేయాలి. బుకింగ్ చేసిన 24 గంటల్లో మీకు క్యాష్‌బ్యాక్ స్క్రాచ్ కార్డ్ లభిస్తుంది. ఈ స్క్రాచ్ కార్డును 7 రోజుల్లో ఉపయోగించాలి., ఇది బిల్ చెల్లింపు తర్వాత మీకు లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ మొత్తం రూ .10 నుండి 800 రూపాయల వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: