""దీదీ" గెలుపు కాదు ముఖ్యం ... జవాబుదారీతనం ?

VAMSI
ఇంతటి కరోనా సంక్షోభంలోనూ మొన్న అయిదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయంలో... ఎన్నికలు, గెలుపు , ఓటమి మరియు పరిపాలన ఇవన్నీ సాధారణమే. అయితే ఒక నాయకుడు గెలుపు వచ్చినప్పుడు గర్వపడకుండా, ఓటమి చెందినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి తన పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకు అండగా నిలబడాలి. ఇది ప్రతి ఒక్క నాయకునిలో ఉండవలసిన కనీస లక్షణం. కానీ కొన్ని సార్లు పార్టీల మధ్య ఉన్న శత్రుత్వాన్ని అడ్డం పెట్టుకుని గందరగోళాన్ని సృష్టిస్తుంటారు కొంతమంది. వీరి పంతానికి మధ్యలో అమాయక ప్రజలు బలైపోతుంటారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటిదే వెస్ట్ బెంగాల్ లో జరిగింది. ఆదివారం ప్రకటించిన ఫలితాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది.

ఈ విజయాన్ని పురస్కరించుకుని టీఎంసీ పార్టీకి చెందిన కార్యకర్తలు వెస్ట్ బెంగాల్ లో విద్వంసాన్ని సృష్టించారు. ముఖ్యంగా బీజేపీ కార్యాలయాల ముందు విజయోత్సవాన్ని జరుపుకోవడమే కాకుండా, వారి ఫ్లెక్షీలను తగలబెట్టడం, కార్యాలయాలను నాశనము చేయడం, కార్యకర్తల మీద దాడులు చేయడం, వారి వ్యాపారాలపై లూటీలు చేయడం, హోటల్స్ ను పగలగొట్టడం, డబ్బులు దోచుకుని పోవడం ఇలాంటి ఎన్నో అరాచకాలను సృష్టించారు. అంతే కాకుండా ఆడపిల్లపై అత్యాచారానికి పాల్పడి ప్రాణాలను తీయడం ఎంతో బాధాకరం. అయితే మమతా బెనర్జీ మాత్రం వీటన్నింటికీ నేను కారణం కాదని సైలెంటుగా కూర్చుంది. ఈ విధంగా టీఎంసీ కార్యకర్తలు చేసే దురాగతాలను సమర్ధిస్తూ వస్తోంది.

అదే మనము తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుంటే ఇక్కడ కూడా డీఎంకే విజయాన్ని పురస్కరించుకుని ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు అమ్మ క్యాంటీనుల ఫ్లెక్సీలు చించేసి...ఆ బోర్డులను కింద పడేసి..క్యాంటీను మూసివేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనితో ఎఐడీఎంకే వాళ్ళు కేసు పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డీఎంకే ప్రభుత్వం వారిని అరెస్ట్ చేయడానికి అనుమతిచ్చింది.  ఆ తరువాత స్టాలిన్ వారిద్దరినీ పార్టీనుండి సస్పెండ్ చేశారు. ఇది బాధ్యతాయుతమైన నాయకుడు చేయాల్సిన పని. ఈ సంఘటనతో అయినా మమత స్టాలిన్ ను చూసి సిగ్గు తెచ్చుకోవాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: