సింహాల నుంచి మనుషులకు కరోనా?
దాదాపుగా ప్రతి రోజు నాలుగు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు కరోనా వైరస్ కేసులు మనుషుల్లో వెలుగు లోకి వచ్చాయి కానీ జంతువుల్లో కరుణ కేసులు ఇప్పటి వరకు వెలుగు లోకి రాలేదు కానీ ఇటీవలే హైదరాబాద్ లోని జూలాజికల్ పార్కులో సింహాల కు కరోనా పాజిటివ్ రావడం మాత్రం సంచలన గా మారి పోయింది. ఇక వెంటనే అప్రమత్తమైన అధికారులు జూలాజికల్ పార్కులో సందర్శకులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు సింహాలకు ప్రత్యేకమైన చికిత్స కూడా అందిస్తున్నారు.
అయితే హైదరాబాద్లోని నెహ్రు జూలాజికల్ పార్కులో 8 సింహాలకు కరోనా పాజిటివ్ రాగా వెంటనే అప్రమత్తమైన పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. అయితే ఈ వైరస్ వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు అంటూ చెప్పుకొచ్చింది. జంతువు లకు కరోనా వైరస్ సోకటం దేశంలో తొలిసారి అంటూ చెప్పిన అటవీ శాఖ ఇక జంతువుల నుండి మనుషులకు వైరస్ సోకటం జరగ లేదని స్పష్టం చేసింది. ఇక ఈ విషయాన్ని రిపోర్ట్ చేసే సమయం లో మీడియా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర అటవీ శాఖ తెలిపింది.