యూకేలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హాంప్‌షైర్ కు చెందిన జేమ్స్ ఒస్బోర్న్ కు పాలసీసాలు కనిపించాయి. వెంటనే వాటిని ఎత్తుకుని చూశాడు. అయితే ఆ సీసాల నుంచి తెల్లటి పొగ బయటకు వచ్చింది. అదేదో భయంకరమైనదని గుర్తించి పోలీసులకు తెలిపాడు. ఓ రోజు తన ఇంటికి కొంత దూరంలో కొన్ని సీసాలు ఉండటాన్ని గమనించాడు. వాటిని భూమి నుంచి నేల మీద పెడదామని ప్రయత్నిస్తుండగా వాటి నుంచి పెద్ద ఎత్తున పొగ వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా సీసాల నుంచి పొగ వచ్చే విషయాన్ని అతను పోలీసులకు తెలియజేశాడు. వారు తిరుగుతున్న ఆ ప్రదేశంలో 48 సీసాలను బయటకు తీశాడు. వాటిని గమనిస్తుండగా అవేంటో కూడా తెలియలేదు. దీంతో వెంటనే చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని చెప్పాడు. పోలీసులు వచ్చి వాటిని పరిశీలించి అవి గ్రెనేడ్ లుగా నిర్ధారించారు. వెంటనే వారు ఆ బాంబులు పేలకుండా తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
బాంబులు పేలకుండా చేశారు. ఈ ఘటన కలకలం రేపాయి. ఆ ప్రాంతంలో నాజీల దాడి నుండి గ్రామాలను రక్షించడానికి 1940 లలో పేలుడు పదార్థాలను దాచి ఉంచినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఒస్బోర్న్ తండ్రి ఆ స్థలాన్ని ఆ సమంలో ఆర్మీ తరహా హోమ్ గ్రౌండ్ సమూహాలకు అప్పగించారు. ”ఇది రెక్టర్ యొక్క ఇల్లు. ఇది గ్రామంలోని పురాతన భవనాలలో ఒకటి. ఇక్కడ రెక్టర్ నివసించారు కాబట్టి, ఇది స్థానిక హోమ్ గార్డ్ యొక్క ప్రధాన సమావేశ ప్రదేశాలలో ఒకటిగా ఉండవచ్చు” అని ఒస్బోర్న్ చెప్పారు. గత ఏడాది డిసెంబర్ లో కూడా ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో వంటగది లోపల బాంబు పేలుడు సంభవించింది. ఆ టైంలో ఆ బాంబు పేలుడు వల్ల ఎవ్వరికీ ఏమీ జరగలేదు.జోడీ క్రూస్, ఆమె ఎనిమిదేళ్ల కుమార్తె ఇసాబెల్లా కు ఎటువంటి ప్రమాదం జరగలేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: