కాళ్ళు పట్టుకున్న కనికరించలే.. చివరికి ప్రాణం పాయే..?

praveen
కరోనా.. కరోనా.. కరోనా.. మనుషుల్లో మానవత్వాన్ని  చంపేస్తోంది.. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా చేస్తోంది..  కనీసం జాలి దయ అనేది పూర్తిగా కనుమరుగయ్యేలా చేరుతోంది.. కళ్లముందే మనిషి ప్రాణాలు పోతున్నా కనీసం కనికరం లేకుండా ఉన్న మనుషులను తయారు చేస్తుంది ఈ మహమ్మారి రక్కసి. ఒక మనిషిని చంపడానికి ముందే ఆ మనిషి యొక్క ధైర్యాన్ని చంపేస్తోంది.. ఒక మనిషి యొక్క ధైర్యాన్ని చంపడమే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మానవత్వాన్ని చంపేసి చివరికి బతకడం కంటే చావడమే మేలు అనే పరిస్థితిని తీసుకొస్తుంది కనికరంలేని కరోనా.  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వెలుగులోకి వస్తున్న ఎన్నో హృదయ విదారక ఘటన రోజురోజుకు అందరినీ భయాందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి.



 కళ్లెదుటే నిండు ప్రాణం కుప్పకూలిపోయిన కనీసం చేయి అందించడం లేదు నేటి రోజుల్లో ఎవరు.  ప్రాణాలు పోతున్నాయని దయ చూపి సహాయం చేయాలి అంటూ కాళ్ళు పట్టుకుని వేడుకున్న కనీసం కనికరం చూపడం లేదు చుట్టుపక్కల జనాలు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  అనారోగ్యంతో సదరు వ్యక్తి భార్య కుమారులతో కలిసి ఆస్పత్రికి వెళుతున్నాడు. సరిగ్గా ఆసుపత్రికి చేరుకోగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.  ఇక అచేతన స్థితిలో తన భర్త ప్రాణాలతో ఉన్నాడా లేదా అన్నది కూడా ఆమెకు తెలియడం లేదు అరణ్యరోదనగా భర్త పక్కనే కూర్చుని ఏడుస్తుంది.



  నాన్న ఒక్కసారిగా పడిపోయాడు.. కాస్త సాయం చేయండి సార్.. అంటూ అతని కొడుకు అక్కడున్న వారందరినీ ఎంతగానో వేడుకున్నాడు.  కానీ అక్కడ ఎవరి గుండె కరగలేదు   సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడంతో చివరికి అతని ప్రాణాలు వదిలాడు. ఘటన కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.  ఎండపల్లి గ్రామానికి చెందిన చంద్ర రావు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవలే వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లాడు ఈక్రమంలోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయితే భర్తకు ఏమైందో తెలియక ఇక భర్త వద్ద కూర్చుని విలపించింది భార్య. సహాయం చేయాలని  కొడుకు ఎంతోమంది వేడుకున్నాడు కానీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు  సహాయం కోసం ఎదురు చూసిన ఎవరు ముందుకు రాలేదు చివరికి అతను ప్రాణాలు కోల్పోవడంతో ప్రైవేట్ అంబులెన్స్లో ఇంటికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: