ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త.. అసలు మ్యాటరెంటంటే?
ఈ విచిత్ర ఘటన బీహార్ లో వెలుగు చూసింది... ఖగారియా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు.సినిమా స్టోరీలకు గుర్తుచేసే ఈ రీల్ స్టోరీకి బీహార్ రాష్ట్రం వేదికైంది. ఖగారియా జిల్లాకు చెందిన సప్న భాగల్‌పూర్ జిల్లా సుల్తాన్ గంజ్‌కు చెందిన ఉత్తమ్ మండల్ అనే వ్యక్తిని ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే భర్త సమీప బంధువైన రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమలో మునిగిపోయింది. అతనితో మాట్లాడకుండా, చూడకుండా అస్సలు ఉండేది కాదు..
ఈ విషయం తెలిసిన భర్త, భార్యను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదు. నచ్చ చెప్పాడు. మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? అని ప్రశ్నించాడు. కానీ ఆమెలో మార్పు రాలేదు. దీంతో ఏం చేయాలో తెలీయని ఉత్తమ్ నిజంగా ఉత్తముడే అయ్యాడు. ఇక చేసేదేమీ లేక ఇరు కుటుంబాలకు సమాధానం ఇచ్చాడు.వాళ్లు జోక్యం చేసుకుని సప్నకు నచ్చజెప్పేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ ఆమె వారి మాటలను లెక్క చేయలేదు..భర్త ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇరు కుటుంబాల నడుమ భార్యకు ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాడు. కన్యాదాత గా మారాడు.. ఈ ఘటన ఆ నోటా ఈ నోటా పాకి వైరల్ అయ్యింది..