కేసీఆర్ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు.. సారూ అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..?

praveen
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒక ఎన్నిక ముగియగానే మరొక ఎన్నిక సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణ రాజకీయాలు మొత్తం వాడివేడిగా మారిపోతున్నాయి.  అయితే ఇటీవలే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సంబంధించిన పోలింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే మరోవైపు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తూ ఉంటే ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది.


 స్థానిక పోరు ఎన్నికల్లో కరోనా వైరస్ ప్రభావం పెరిగే అవకాశం ఉందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.. స్థానిక ఎన్నికల నిర్వహణ పై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన రిపోర్టు పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోవడం మరణాల సంఖ్య కూడా విపరీతంగా ఉండటం పై ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. అంతేకాకుండా కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 29 లోగా నివేదిక సమర్పించాలని అంటూ ఎస్ఈసికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దీంతో అధికార పార్టీకి ఊహించని షాక్ తగిలింది అనే చెప్పాలి.



 శరవేగంగా ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ల తో పాటు మూడు మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరపాలని సిద్ధమైంది అధికార పార్టీ. అయితే ఇక ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రస్తుతం అధికార పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇక రానున్న రోజులలో జరగబోయే ఈ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పట్లో ప్రభుత్వ ఎన్నికలు నిర్వహించాలి అనుకున్న కోరిక తీరేలా మాత్రం కనిపించడం లేదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: