తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు.. ఫైనల్ డెసిషన్ ఇదేనా..?
అయితే ఇప్పటికే గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య విద్యార్థులకు కనీసం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి రావడంతో ఇక పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈసారైనా పరీక్షలు నిర్వహిస్తారెమో అని అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మళ్లీ పరీక్షలు వాయిదా వేసే దుస్థితి వచ్చింది. ఇప్పటికే ఫస్టియర్ తో పాటు టెన్త్ పరీక్షలు కూడా ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ సెకండియర్ పరీక్షల పై జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది అని అందరు అనుకున్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ సెకండియర్ పరీక్షల నిర్వహించే అవకాశం తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జూన్ మొదటి వారంలో పరీక్షలు జరగాల్సి ఉండగా అప్పటివరకు ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం లేదు అదే సమయంలో అటు ప్రైవేటు లెక్చరర్లు పరీక్షల నిర్వహణకు ఎంతవరకు సహకరిస్తారు అన్నది కూడా ఆందోళన గానే మారిపోయింది. ఇక కరోనా తగ్గేంత వరకు పరీక్షలు నిర్వహించకుండా వేచి చూస్తే ఇక ఆ తర్వాత కాలేజీలతో పాటు ఐఐటీలలో చేరడానికి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఇలాంటి నేపథ్యంలో ఇక సెకండియర్ పరీక్షలను కూడా రద్దు చేయడం మేలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం అటు ప్రాక్టికల్స్ ని కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.