కని కరోనా : సోక కుండానే తల్లి బిడ్డలను చంపేసిన కరోనా.. చివరికి..?

praveen
దేశంలో విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఎంతో మంది పై పంజా విసిరి ప్రాణాలను తీసుకోవడమే కాదు ఇంకా ఎంతోమందిని సోకకుండానే ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి ఎన్నో దుర్భర పరిస్థితులను తీసుకువస్తూ ఈ లోకంలో బ్రతకడం కంటే చావడం మేలు అనుకునే పరిస్థితులను తీసుకువచ్చి సోకకుండా ఎంతోమంది ప్రాణాలను తీసేస్తుంది మహమ్మారి l వైరస్. ఇలా కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది రోడ్డున పడే పరిస్థితులు వచ్చి చివరికి కుటుంబ పోషణ కూడా చూసుకోలేని దీనస్థితిలో ఆత్మహత్యలే శరణ్యం అంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ఎంతోమంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.. తమ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఇక పెట్టుబడిగా పెట్టి పంట సాగుచేశారు రైతులు. అనుకున్నట్లుగానే ఎంతో బాగా పండింది పంట. కానీ కరోనా వైరస్ వారి ఆశలను చిదిమేసింది మార్కెట్లో వారు పండించిన పంటను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో ఇక పెట్టుబడి కూడా రాదు అని అనుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆత్మహత్యే శరణ్యమని భావించి ఇక ఆ తల్లి ఏకంగా పిల్లలతో సహా శానిటైజర్ పోసుకుని నిప్పంటించుకున్న విషాదకర ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెలుగులోకి వచ్చింది


 ఆత్మకూరు మండలానికి చెందిన సుబ్బులు ప్రకాశం జిల్లాకు చెందిన కొండా రెడ్డి భార్య భర్తలు వీరికి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు అయితే కర్ణాటక రాష్ట్రం బళ్ళారి వలస వెళ్లి 10 ఎకరాల్లో 20 లక్షలు పెట్టుబడి పెట్టి అంజూర పంట సాగు చేశారు ఈ ఇద్దరు దంపతులు. పంట బాగా పడడంతో ఆనందంలో  మునిగిపోయారు. కానీ అంతలోనే కరోనా వైరస్ రెండవ దశ విజృంభించడంతో వీరి ఆశలు అడియాశలు గా మారిపోయాయి. అంజూర అమ్ముకునే అవకాశం లేక పెట్టుబడి రాక ఆర్థికంగా చితికిపోయారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన  భార్య సుబ్బులు తన ఇద్దరు పిల్లలతో నెల్లూరులోని పుట్టింటికి వస్తుంది తెలవారుజామున బస్సు దిగి తన దగ్గర ఉన్న శానిటైజర్ తనతోపాటు బిడ్డలపై కూడా పోసుకొని నిప్పంటించుకుంది. ఈ క్రమంలోనే భయపడిన కొడుకు అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఇక సుబ్బులు మధురవాణి మంటల్లో చిక్కుకుని మృతిచెందారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: