ఆక్సీజన్ కోసం మోడీ అద్భుత నిర్ణయం.. ఇక నాన్ స్టాప్..?
ఆసుపత్రులకు వెళ్తున్న రోగుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో ఆస్పత్రిలో బెడ్లు వెంటిలేటర్లు ఆక్సిజన్ కూడా కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతోమంది కరోనా వైరస్ బారిన పడిన రోగులు ప్రాణాలు కోల్పోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇక దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు అటు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలోనే ఇక ఆక్సిజన్ పంపిణీ పై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు ఇక కొరత లేకుండా ఆక్సిజన్ అందే విధంగా చర్యలు చేపట్టింది.
అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు రైలు రోడ్డు మార్గాన్ని ఎంచుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆక్సిజన్ ఉత్పత్తిని సంపూర్ణంగా చేయాలి అంటూ దేశంలోని అన్ని పరిశ్రమలకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ముఖ్యంగా రైలు మార్గాన్ని ప్రధానంగా ఆక్సిజన్ పంపిణీ కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారి ఆక్సిజన్ ట్యాంకర్లను రైలులో ఎక్కించిన తర్వాత ఇక ఒక్కసారి రైల్ మొదలయ్యిందీ అంటే ఇక ఎక్కడ ఆగకుండా ఆక్సిజన్ చేరాల్సిన ప్రాంతానికి నాన్ స్టాప్ గా రైలు వెళ్లే విధంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటు రోడ్డు రవాణా లో కూడా ఆక్సిజన్ తీసుకెళ్తున్న వాహనాలకు పూర్తిగా అన్ని రాష్ట్రాలలో తిరిగే అవకాశం ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం సూచించిం.ది ఇక తద్వారా వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిన ఆక్సిజన్ కొరత తీర్చాలి అని అనుకుంటుంది కేంద్రం.