ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం...?

VAMSI
ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారీగా ఉంది. రోజు రోజుకీ కేసుల సంఖ్య వేళల్లో వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలోని పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర రాష్ట్రము లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మన దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ దిశగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రానున్న ఆరు రోజుల పాటుగా లాక్ డౌన్ ను విధించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ లాక్ డౌన్ ఈ రోజు అర్ధ రాత్రి 12 గంటల నుండి రానున్న సోమవారం ఉదయం 6 గంటల వరకు అమలు కానుంది.

గత సంవత్సరం కూడా ఈ విధంగా ఢిల్లీ లో కేసులు నమోదైనది లేదు. కానీ సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాబోయే రోజుల్లో మనము కఠినంగా ఉంటే తప్ప సురక్షితంగా ఉండలేమని అందుకే లాక్ డౌన్ విధిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆరోగ్య పరిస్థితి బాగుండాలని అన్ని రకాల చర్యలను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియచేశారు. ఉన్న హస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఉన్న మాట వాస్తవమే, కానీ అత్యవసర సేవలు, ఫుడ్ సర్వీసెస్ మరియు మెడికల్ సర్వీసెస్ కి అంతరాయం కలుగకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.

తంలో లాగే పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేవారు కేవలం 50 మందితోనే చేసుకోవాలన్నారు.  ఇలాంటి వాటి కోసం ముందుగానే పాసుల కోసం అప్లికేషన్ పెట్టుకోవాలన్నారు. ఈ కోవిడ్ పరీక్షల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. ఇటువంటి విపత్కర సమయంలో ఢిల్లీ ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు.  రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కార్యాలయాలు వర్క్ ప్రం హోమ్ విధానాన్ని ప్రారంభించాలని సూచించారు. అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: