అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు ధారబోశారు...ఎంత పట్టుకున్నారో తెలుసా...?
అయితే ...ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగా ప్రస్తుతం... పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఘట్టం కొనసాగుతోంది. మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. శనివారం ఐదో దశ ఎన్నికలు జరగుతున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో పలు పార్టీలు తమ ఆధిక్యతను పెంచుకోవడం కోసం ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మద్యాన్ని కుమ్మరించాయి . పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, డ్రగ్స్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది.
ఇంత పెద్ద మొత్తంలో భారీగా నగదు, మద్యం ,డ్రగ్స్ దొరకడం ఇదే మొదటిసారి అని పోలీసులు పేర్కొన్నట్లు వినికిడి. 2016 లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే... ఈ సారి రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఖర్చు చేసిన ధనం రెట్టింపు అయింది అని కొన్ని నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇలా జరగడం ప్రజాస్వామ్యానికే ఒక మచ్చగా పలువురు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా ఇటువంటి డబ్బు, మందు, బంగారు పంచకుండా ఎన్నికలు జరుగుతాయేమో చూడాలి.