సాగ‌ర్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ ప్ల‌స్‌లు, మైన‌స్‌లు... ఎవ‌రికి క‌లిసొచ్చేనో ?

VUYYURU SUBHASH
తెలంగాణ‌లో నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మ‌రి కొద్ది గంట‌ల్లోనే సాగ‌ర్ ఉప ఎన్నిక పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్ర‌ధాన పార్టీలు పోటీలో ఉన్నా ప్ర‌ధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ మ‌ధ్యే ఉంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. వీరిద్ద‌రి బ‌లాలు, బ‌ల‌హీన‌తల మ‌ధ్య సంగ్రామంలో అంతిమంగా ఎవ‌రు పై చేయి సాధిస్తారో ?  చూడాలి.

కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రంగంలో ఉన్నా జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యే, 14 ఏళ్లు మంత్రిగా పని చేశారు. ఆయ‌న రెండు సార్లు మాత్ర‌మే ఓడిపోయారు. తాజా ఎన్నిక‌ల్లో ప‌దో సారి అసెంబ్లీ బ‌రిలో ఉన్నారు. ఆయ‌న మంత్రిగా ఉన్న‌ప్పుడు నియోజకవర్గంలో సిమెంటు రోడ్లు, సబ్‌ స్టేషన్లు, విద్యుత్తు లైన్ల విస్తరణతో పాటు అనేక చిన్న త‌ర‌హా ఇరిగేష‌న్ ప్రాజెక్టులు తెచ్చారు. ఇవ‌న్నీ ఆయ‌న‌కు ప్ల‌స్ కానున్నాయి. ఆయ‌నకు ఉన్న క్లీన్ ఇమేజ్ తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత ప‌రిచ‌యాలు ఆయ‌న‌కు ప్ల‌స్‌.

దీనికి తోడు గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో న‌ల్ల‌గొండ‌, భువ‌న‌గిరి రెండు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెల‌వ‌డంతో పాటు సాగ‌ర్లో కాంగ్రెస్‌కు మెజార్టీ వ‌చ్చింది. ఇక జానారెడ్డి బ‌ల‌హీన‌త‌ల విష‌యానికి వ‌స్తే ఇటీవ‌ల తెలంగాణ‌లో వ‌రుస ఓట‌ముల‌తో కాంగ్రెస్ డీలా ప‌డ‌డంతో పాటు జానారెడ్డికి యువ‌త‌లో గ్రిప్ లేక‌పోవ‌డం.

ఇక టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భగత్ బ‌లాల విష‌యానికి వ‌స్తే తెలంగాణ‌లో టీఆర్ఎస్ వ‌రుస‌గా రెండో సారి అధికారంలోకి రావ‌డం... ఆ పార్టీ దుబ్బాక మిన‌హా అన్ని ఎన్నిక‌ల్లోనూ ఓట‌మి లేకుండా గెల‌వ‌డం.. 37 వేల యాదవ సామాజిక వర్గం ఓట్లు, మంత్రులు అంద‌రూ ఇక్క‌డ ప‌ని చేయ‌డం... సీఎం కేసీఆర్ స్వ‌యంగా బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని భారీ హామీలు ఇవ్వ‌డం.

ఇక బ‌ల‌హీన‌త‌ల్లో నోముల నర్సింహయ్య కుమారుడిగా తప్ప స్థానికంగా పెద్దగా పరిచయం లేక‌పోవ‌డం, రాజ‌కీయ అనుభ‌వం నిల్‌.. స్థానికేత‌రుడు అన్న విమ‌ర్శ‌లు, తండ్రి అధికారంలో ఉన్న‌ప్పుడు దూకుడుగా ఉన్నార‌న్న విమ‌ర్శ‌లు, రెడ్డి వ‌ర్గం స‌రిగా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం. మ‌రి ఈ ఇద్ద‌రిలో త‌మ బ‌లాల‌ను వాడుకుని, బ‌ల‌హీన‌త‌ల‌ను అధిగ‌మించి ఎలా ?  ఎవ‌రు ?   విన్ అవుతారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: