
ఆ రోజే సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాను : బాబా రాందేవ్
అయితే యోగా గురువు రాందేవ్ బాబా ఇక పతాంజలి అనే బ్రాండ్ ని ప్రారంభించి పతంజలి ద్వారా ఎన్నో ఆయుర్వేదిక ఔషధాలను కూడా ప్రజలందరికీ అందజేస్తున్నారు. తక్కువ ధరకే ప్రస్తుతం పతాంజలి ప్రాజెక్టులను అందజేస్తూ ఎంతగానో ఫేమస్ అయిపోయారు యోగా గురువు రాందేవ్ బాబా. సాధారణంగా యోగా గురువు రాందేవ్ బాబా గురించి కొన్ని విషయాలు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆయన ఏ వయస్సులో సన్యాసం తీసుకున్నారు.. ఏ రోజున సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది అన్నది మాత్రం చాలామందికి తెలియదు. అయితే ఇటీవలే ఓ కార్యక్రమానికి హాజరైన రాందేవ్ బాబా ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇటీవల ఇండియన్ ఐడల్ 12 కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా గురు రాందేవ్ బాబా. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నారు. దాదాపు 27 ఏళ్ల క్రితం శ్రీరామనవమి రోజున పూర్తిగా అన్ని విలాసాలను వదిలేసి సన్యాసిగా మారాలి అని నిర్ణయించుకున్నాను అంటూ రాందేవ్ బాబా చెప్పుకొచ్చారు. శ్రీరామనవమి పర్వదినానానికి నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది అంటూ చెప్పుకొచ్చారు రామ్ దేవ్ బాబా. ఎందుకంటే ఈరోజు నాకు కొత్త జన్మనిచ్చిందని ఒక సాధారణ జీవితాన్ని గడిపేందుకు నాంది పలికింది అంటూ చెప్పుకొచ్చారు అయితే ఇటీవలే విడుదలైన ఇండియన్ ఐడల్ 12 ప్రోమో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఎపిసోడ్ శ్రీరామనవమి రోజున విడుదల కానుంది.