చంద్ర బాబు కు మళ్లీ షాక్ ఇచ్చిన పోలీసులు..

Satvika
మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు కు ఎన్నికల నేపథ్యంలో భారీ ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే.. గతంలో జరిగిన పంచాయితీ ఎన్నికల ప్రచారంలో ప్రజలు నిరసన తెలిపారు.. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో అయిన విజయాన్ని అందుకోవాలన్న తపనతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.. దీనికోసం వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.తిరుపతి నుంచి నెల్లూరు వరకు ఆయన రోజుకో ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు.


ఇది ఇలా ఉండగా.. నిన్న ఆయన పర్యటన రసాభాసగా మారింది. ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతిలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిందని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని డీఐజీ క్రాంతి రాణా తెలిపారు. గాయాలైన ఇద్దరు వ్యక్తులను కూడా విచారించామన్నారు. వాళ్ల ఇద్దరిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశామని చెప్పారు. స్థానిక సీసీ, మొబైల్, మీడియా ఫుటేజ్‌లను కూడా పరిశీలించామని తెలిపారు. చంద్రబాబు సభకు ఆటంకం కలిగించాలని, దుండగులు వచ్చి రాళ్లు విసిరినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని డీఐజీ క్రాంతి రాణా స్పష్టం చేశారు.


చంద్రబాబు సభకు ఎలాంటి ఆటంకం కలుగకుండా యథావిథిగా జరిగిందని, సభ అయిపోయిన తర్వాత చంద్రబాబు వైపు రాళ్లు విసిరినట్లు తమకు ఫిర్యాదు అందిందని క్రాంతి రాణా తెలిపారు. ఇక ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. విచారణ వేగవంతం చేశారు. చంద్రబాబు సభ మొత్తం సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. రాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు సీసీ ఫుటేజీ పరిశీలించగా, సభలో ఎక్కడా రాళ్లు పడినట్టు కనపడలేదనని డీఐజీ కాంతిరాణ టాటా వెల్లడించారు. గాయపడ్డారని చెబుతున్న వారి స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డ్‌ చేశారు. ఈ కేసులో అసలు నిజాలను త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: