ముస్లిం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. అప్పటి నుంచే..
సాయంత్రం సూర్యాస్త మయం అనంతరం మరోసారి ప్రార్థనల్లో పాల్గొని.. ఆ రోజుకు ఉపవాస దీక్షల ను విరమిస్తుంటారు. దీన్ని దృష్టి లో ఉంచుకుని జగన్ సర్కార్ ప్రభుత్వ ముస్లిం ఉద్యోగుల కు కొంత ఊరటను కల్పించారు. ప్రార్థనల్లో పాల్గొనడాని కి, ఉపవాస దీక్షను విరమించడానికి వీలుగా గంట ముందుగా వారు కార్యాలయా ల నుంచి ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..
ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఈ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. రంజాన్ పండుగ వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. మే 13 లేదా 14వ తేదీ రంజాన్ పండుగ ను జరుపుకొంటారు. ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పవిత్ర మైనది. భక్తి శ్రద్ధల తో వారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షల ను పాటిస్తారు. రోజూ అయిదుపూటలా నమాజ్ చేస్తారు.. అయితే కరోనా సెకండ్ వేవ్ అతి వేగంగా వ్యాపిస్తుంది. గత ఏడాది రంజాన్ మాసంలో కేంద్రం తో ముస్లిం సోదరులు ఫైట్ కూడా చేశారు.. నిబంధనలను అనుసరించి రంజాన్ జరుపుకుంటాం అనిబెంత చెప్పిన కూడా ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు. గతంలో లాగా ఈ ఏడాది కూడా రంజాన్ వేడుకలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది..