ప్రతిపక్షాలు జగన్ గురించి చెడుగా మాట్లాడుతున్నాయ్.. అందుకే ఇలా చేసా : రఘు రామ
ఇక ఇటీవలే మరో సారి ఏకంగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి వచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రఘురాము. జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అవినీతి కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతుంది అని వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయలంటూ పిటిషన్ దాఖలు చేశారు.అయితే ఇలా బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారిపోయింది.
ఈ క్రమంలోనే ఇక వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేయడం పై వివరణ కూడా ఇచ్చారు. ఈ దాఖలు చేసిన చార్జిషీటులో సీఎం జగనే ఏ 1 గా ఉన్నాడని ప్రజాస్వామ్యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. తాజాగా మరోసారి దీని పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. సీఎం జగన్ బెయిల్ విషయంలో రేపు సిబిఐ కోర్టు కీలక తీర్పు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి అంటూ రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. జగన్ గురించి ప్రతిపక్షాలు చెడుగా మాట్లాడకూడదు అనే ఉద్దేశంతోనే బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు.