
త్వరపడండి.. ఇలా చేస్తే.. బీర్ ఫ్రీ..?
అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ కూడా దేశంలో వ్యాక్సిన్ పై ఇప్పటికీ కూడా కొంత మంది ప్రజల్లో అవగాహన లేకుండా పోయింది.ఇక వ్యాక్సిన్ వేసుకోవడానికి కొంత మంది ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల దుష్ప్రభావాలు వస్తాయి అని ఇప్పటికి కూడా అపోహలతో ఎంతోమంది వ్యాక్సిన్ కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది అధికారులు మరి కొంత మంది వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకునేందుకు అందరూ ముందుకు వచ్చే విధంగా కొన్ని వినూత్నమైన ఆఫర్లను తెరమీదికి తెస్తున్నారు.
ఇటీవలే ఓ రెస్టారెంట్ యజమానులు వ్యాక్సిన్ వేసుకునేందుకు అందరూ ముందుకు వచ్చేలా ఒక అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చారు. హర్యానా గుర్గావ్లో నీ రెస్టారెంట్ మందుబాబులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. కరోనా వైరస్ టీకా వేయించుకున్న వారికి ఫ్రీగా బీర్ అందిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. ఇండియన్ గ్రిల్ రూమ్ అనే రెస్టారెంట్ ఈ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా కార్డు చూపిస్తే ఒక బీరు ఉచితంగా ఇస్తానంటూ తెలిపింది. ఈ ఆఫర్ వారం రోజుల పాటు అందుబాటులో ఉంటుంది అన్న విషయాన్ని రెస్టారెంట్ యజమానులు తెలిపారు. అయితే ఇలాంటి వినూత్నమైన ఆఫర్ ప్రకటించడంతో ఈ రెస్టారెంట్ పేరు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.