జగన్ పై రఘురామ కు అంత కోపం ఎందుకు?

Satvika
ఏపిలో ఎన్నికల పరంపర కొనసాగుతోంది.. వరుస ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల కమీషన్ అదే పనిలో ఉంది.. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్, నిన్న పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ పది న వాటి ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి తిరుపతి ఉప ఎన్నికల పై పడింది.ఉపఎన్నిక ప్రచారం పుంజుకుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మూడు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ర్యాలీ, సభ నిర్వహించారు.


బీజేపీ నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు. తిరుపతి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయతిస్తున్నారు. అయితే, తిరుపతిలో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సత్తాను చాటాలని వైసీపీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూనే ఉంది.తిరుపతిలో ఓ ఆశ్రమానికి సంబంధించి రూ.30 కోట్ల స్కాంతో పాటు రిటైర్ అర్చకుడు రమణ దీక్షితులను మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమించడం జరిగింది.


ఇకపోతే ఆయన జగన్ జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం వంటి అంశాలు తిరుపతి ఉపఎన్నికపై ప్రభావం చూపుతున్నాయి. వివేకానంద రెడ్డి హత్య ఎన్నికల్లో అస్త్రంగా వాడుతున్నారు.సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ సరిగాలేదని కోర్టు రిటర్న్ చేసింది. ఇక జగన్ బెయిల్ రద్దు అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాదు.. రఘు రామకు జగన్ పై అంత కోపం ఎందుకు? బెయిల్ ను రద్దు చేయించేంత ఏం జరిగింది? ఇలాంటి పలు ప్రశ్నలు జనాలకు వస్తున్నాయి. ఇక చివరికి వీరిద్దరి మధ్య రగడ ఎంతవరకు వెళుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: