తిరుపతి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?
ఇక నెల్లూరు జిల్లా పార్టీ నేతలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇంత హడావిడి జరుగుతుంటే జిల్లాకే చెందిన పార్టీ కీలక నేత, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాబుకు రైట్ హ్యాండ్‌గా ఉన్న మాజీ మంత్రి పొంగూరు నారాయణ అడ్రస్ మాత్రం కనపడడం లేదు. గత ప్రభుత్వంలో నారాయణ నామస్మరణ ఎంత హైలెట్ అయ్యేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారాయణ చుట్టూ మామూలు సందడి ఉండేది కాదు. అలాంటి నారాయణ ఇప్పుడు తన సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఎంపీ సీటుకు ఉప ఎన్నిక జరుగుతుంటే మచ్చుకు అయినా అటు వైపు చూడడం లేదు.
టీడీపీ శ్రేణులు అయితే నారాయణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే సెటైర్లు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అన్నింటికి మించి నారాయణ ఐదేళ్లు మంత్రిగా ఉన్నా.. తర్వాత మంత్రి అయిన సోమిరెడ్డి హవా అటు జిల్లాలోనూ, ఇటు జిల్లా కేంద్రమైన నెల్లూరులోనే ఎక్కువుగా నడిచింది. చంద్రబాబు, లోకేష్ సైతం సోమిరెడ్డికే ప్రయార్టీ ఇవ్వడం కూడా నారాయణకు నచ్చలేదు. ఇక ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నెల్లూరు టీడీపీలో సోమిరెడ్డి, బీదా రవిచంద్ర లాంటి వాళ్లు మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎన్నికల్లో నారాయణకు కొందరు నేతలు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆవేదనతో ఉన్నారు. బాబు కూడా ఈ విషయంలో పట్టించుకోకపోవడం... ఇటు క్షేత్రస్థాయిలో ఆయనకు గ్రిప్ లేకపోవడంతో పాటు ఇప్పుడు ప్రచారంలో ఉన్నా చేతిచమురు వదలడం తప్పా ఏం ఉపయోగం ఉండదనే నారాయణ అసలు జిల్లాకే రావడం లేదంటున్నారు.