వాట్సప్ అడ్మిన్ లు జాగ్రత్త.. జైలుకు వెళ్లక తప్పదు..?
ఈ సోషల్ మీడియా యాప్స్ అన్నింటిలో కూడా ఇలాంటి వార్త వైరల్ గా మారిపోయి అటు జనాలు అందరిని కూడా అయోమయంలో పడేస్తుంది. ముఖ్యంగా వాట్సాప్ లో వివిధ గ్రూపుల లో కూడా దీనికి సంబంధించిన వార్త తెగ షేర్ అవుతూ ఉంది. అయితే తాజాగా దీన్ని గమనించిన పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారని జీవో జారీ అయినట్లుగా ఒక నకిలీ వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేసిన సంజీవ్ అనే వ్యక్తి ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు .. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో మాట్లాడిన సీపీ అంజనీ కుమార్ వాట్సప్ అడ్మిన్లు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు.
తప్పుడు వార్తలను నమ్మవద్దు అంటూ సూచించారు. ముఖ్యంగా వాట్సప్ అడ్మిన్లు అందరు కూడా వార్త ఎంతవరకు నిజమే అని విశ్లేషణ చేసుకున్న తరువాతనే వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయాలని లేదంటే కఠిన శిక్షలు తప్పవు అంటూ హెచ్చరించారు సీపీ అంజనీ కుమార్. తప్పుడు వార్తలను వాట్సప్ అడ్మిన్ లు గ్రూపులో ప్రచారం చేస్తే ఏకంగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ అటు పోలీసులు తెలిపారు. అయితే కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనలో ఉండగా ఇక ప్రజల భయాలను ఆసరాగా చేసుకుంటూ ఎంతో ముందు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్న నేపథ్యంలో ఇలా తప్పుడు వార్తలు వైరల్ చేస్తున్న వారిపై ప్రస్తుతం తెలంగాణ పోలీసులు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.