దేవుడికి మద్యమే నైవేద్యం.. చివరికి తీర్థం కూడా..?

praveen
సాధారణంగా భక్తులు దేవుళ్లకు నైవేద్యం పెట్టడం ఇక ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. తమ ఇష్ట దైవానికి నైవేద్యం పెట్టి తమ కోరికలు తీర్చాలని తమను కష్టాల నుంచి బయటపడేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. అయితే ఇలా దేవుడికి పూజ చేసే సమయంలో ఎంత శుద్ధితో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్నానం చేసి ఎలాంటి వస్తువులు ముట్టుకోకుండా ఎంతో శుద్ధితో పూజ చేస్తూ ఉంటారు అంతే కాకుండా నైవేద్యం కూడా ఇలా శుద్ధి తోనే పెడుతూ ఉంటారు. మటన్ చికెన్ లాంటివి  దేవుడికి నైవేద్యంగా అసలు పెట్టరు.


 అలాంటిది ఇక మద్యం నైవేద్యంగా పెట్టడం అంటే అది అసలు జరగని పని అని చెబుతారు అందరు.  వాటిని ముట్టుకున్నా కూడా అపవిత్రం అయిపోతాము అని భావించి ఇలాంటివి ముట్టుకోకుండానే ఎంతో శుద్ధితో నైవేద్యం పెట్టి పూజ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి  స్వయంగా ఏకంగా మద్యం నైవేద్యంగా పెట్టడం ఎప్పుడైనా చూసారా..  అలా కూడా నైవేద్యం పెడతారా అని అందరూ అవాక్కవ్వుతారు.  ఇక్కడ భక్తులు మాత్రం దేవుడికి నైవేద్యంగా మద్యం సమర్పిస్తున్నారు.  సాధారణంగా అయితే పూలు పండ్లు పలహారాలు సమర్పిస్తారు కానీ ఇక్కడ మాత్రం మద్యం సమర్పిస్తున్నారు



 అంతే కాదు దేవుడికి సమర్పించిన మద్యాన్ని ఇక ఆ తర్వాత భక్తులందరూ తీర్థంగా కూడా తీసుకుంటున్నారు. కర్ణాటకలో  ఈ సాంప్రదాయం వెలుగులోకి వచ్చింది కేలవాడి గ్రామంలో ఉన్న పురాతన రంగనాథ ఆలయం లో దేవుడికి పండ్లు పలహారాలు కు బదులు లిక్కర్ నైవేద్యంగా ఇస్తున్నారు. పూజ ముగిసిన అనంతరం అక్కడికి విచ్చేసిన భక్తులందరు కూడా ఆ లిక్కర్ తీర్థంగా తీసుకుంటూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఇక ఇటీవల జరగబోయే జాతరలో కూడా ఇలాంటి సాంప్రదాయాన్ని కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా నైవేద్యం పెట్టిన  లిక్కర్ తీర్ధంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని అక్కడ భక్తులు నమ్ముతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: