రెచ్చిపోయిన మానవ మృగం.. మూడేళ్ల చిన్నారి ఒంటరిగా ఉండటంతో..?
నెలలు నిండని పసికందును నుంచి పండు ముసలి వరకు కూడా అందరి పై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అయితే అభం శుభం తెలియని చిన్నారులపై కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలు విరుచుకుపడి అత్యాచారం చేస్తూ ఉండడం అటు అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తుంది. అభం శుభం తెలియని ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక మానవ మృగం అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై విరుచుకుపడి అత్యాచారానికి ఒడిగట్టాడు. భూపతి నగర్కు చెందిన చిన్నారిపై అక్కడే నివాసం ఉంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే ఆ చిన్నారి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.