నన్ను బిచ్చగాడిని చేసావ్.. ఆగ్రహంతో దేవుడిపైనే దాడి చేసిన యువకుడు..?

praveen
సాధారణంగా జనాలు ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తుంటారు. ఇక దేవుని సన్నిధికి వెళ్లి దేవుడా మా కష్టాలను తీర్చు అంటూ వేడుకుంటూ ఉంటారు. అంతే కాకుండా కొంత మంది వివిధ రకాల మొక్కలు కూడా చెల్లించుకుంటారు. దేవుడు సన్నిధానానికి చేరుకొని ఇక తమ కష్టాలను మొత్తం దేవుడికి చెప్పి..  ఈ కష్టాల నుంచి బడి బయట పడేయాలని కోరుకుంటారు. అంతేకాదు కొంతమంది తమ కష్టాలను తీరిస్తే వివిధ రకాల మొక్కులు చెల్లించుకుంటాము అంటూ దేవుడితో బేరసారాలకు కూడా దిగుతూ ఉంటారు. అయితే ఇలా దేవుడిని కోరుకున్న తర్వాత ఇక వారి కోరిక తీరింది అంటే ఎంతో సంతోష పడి పోతూ ఉంటారు అదే తీరకపోతే  దేవుడు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు.



 అయితే ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఏకంగా తనకు అధ్వాన పరిస్థితి వచ్చింది అని భావించి దీనికంతటికీ దేవుడే కారణం అని అనుకొని ఏకంగా దేవుడిపైన దాడి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది లాక్ డౌన్ సమయం లో ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఆర్థిక సమస్యల్లో మునిగిపోయారు. మరికొంతమంది కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు.  ఇక ఆ తర్వాత కూడా ఉపాధి పనులు దొరకకపోవడంతో చివరికి మరింత దుర్భర స్థితిని అనుభవించారు.


 అయితే ఇక్కడ ఒక యువకుడికి కూడా లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయాడు. ఎంత ప్రయత్నించినా పని దొరకలేదు అయితే దీనికంతటికీ కారణం దేవుడే అని ఆరోపిస్తూ ఆ యువకుడు ఆలయం పై దాడికి దిగడం సంచలనంగా మారిపోయింది.  ఆలయ ప్రాంగణంలో శివుని విగ్రహం తో పాటు మరికొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి పలుచోట్ల రాళ్లు ఇటుకలు పడి ఉన్నాయని ఫిర్యాదు రాగా ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనలో 28 ఏళ్ల వివేక్ హస్తం ఉంది అని భావించారు దీంతో వెంటనే అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను సమస్యల పాలు కావడానికి దేవుడే కారణమని అందుకే ప్రతీకారంగానే ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశాను అంటూ ఒప్పుకున్నాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: