కామంతో ఊగిపోయిన గ్రామ వాలంటీర్.. 14 ఏళ్ల బాలిక కనిపించడంతో..?

praveen
మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు కామంతో కళ్లు మూసుకుపోయిన మనుషులు మానవ మృగాలు గా మారిపోయి సాటి మనుషుల మీద కాస్త అయినా జాలి దయ చూపించకుండా దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. వెరసి రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే మహిళలు కామందుల బారినపడకుండా  ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా కామపు కోరల్లో చిక్కుకుని బలవుతున్నారు.


 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారం చేసే వారిని శిక్షించేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తీసుకువచ్చింది. దీంతో మహిళలందరికీ దిశ చట్టం రక్షణ కల్పిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ దిశ చట్టం వచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు ఆగడంలేదు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఎంతో మంది గ్రామ వాలంటీర్లు మహిళలపై అత్యాచారం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తున్నాయి. ఎంతో బాధ్యతగా వ్యవహరించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన గ్రామ వాలంటీర్లు  కామంతో ఊగిపోతూ ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు.



 ఇక ఇటీవల ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా చుండూరు మండలం మున్నంగి వారి పాలెం లో గ్రామ వాలంటీర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఉమామహేశ్వర రావు అలియాస్ పవన్ అనే వాలంటీర్ 14 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఎంతో బాగా చూసుకుంటాను అంటూ 14 ఏళ్ల బాలికను మాయమాటలతో నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.  అతని మోసాన్ని గ్రహించిన బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో ఇక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: