పొట్ట దగ్గర కొవ్వు పెరిగిందా.. కరిగించాలంటే ఈ చిట్కాలు పాటించండి.?

praveen
ఈ మధ్యకాలంలో జనాలు ఎవరు కూడా ఆరోగ్యం మీద అంతగా శ్రద్ధ కనబరచడం లేదు. ముఖ్యంగా ఎవరు కూడా వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. రోజురోజుకు లావుగా మారిపోతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకప్పుడైతే దాదాపుగా అందరూ కూడా  ఎంతో ఫిట్గా ఉండే వారు ఎందుకంటే ఒకప్పుడు ఏం పని చేసినా కూడా శారీరక శ్రమ ఉండేది. కానీ నేటి రోజుల్లో మాత్రం ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఒకే చోట గంటల తరబడి కూర్చుని కంప్యూటర్లలో పని చేయడం లాంటి ఉద్యోగాలు ఉండడంవల్ల..  ఎలాంటి శారీరక కదలికలు లేకపోవడం తో చివరికి భారీగా కొవ్వు పెరిగిపోయి ఇబ్బందులు పడటం లాంటివి చూస్తూనే ఉన్నాము.


 ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తరచూ ఉద్యోగంలో భాగంగా కూర్చొని ఉంటూ ఉండడంతో ఇక పొట్ట భాగంలో బెల్లీ ఫ్యాట్ రోజురోజుకు పెరిగిపోతోంది. తద్వారా ఒకప్పుడు ఫిట్గా ఎంతో అందంగా ఉన్న వారు ఆ తర్వాత లావుగా మారి ఇక పొట్ట వచ్చి  ఎంతో అయోమయంలో పడిపోతున్నారు. అయితే ఇలా భారీగా పెరిగిపోయిన బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు చాలామంది.  కొంతమంది జిమ్లో కసరత్తులు చేస్తూ పొట్ట తగ్గించు కోవాలి అని భావిస్తూ ఉంటే మరి కొంతమంది..   జాగ్రత్తలు పాటించి పొట్ట తగ్గించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.



 అయితే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించాలంటే కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. రోజు ఉదయాన్నే వెల్లుల్లి తినాలని అలా తినడం వల్ల కొవ్వు కరిగిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు. గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తాగడం వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందట. రోజూ ఒక కప్పు పెసర్లు ఉడకబెట్టుకొని తినడం వల్ల కూడా కొవ్వు కరుగుతుందట. ఇక ఒక లీటర్ నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ వాము వేసి మరిగించి తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందట.  సబ్జా గింజలు తినడం లేదా రవ్వ ఉప్మా లాంటివి రోజులో ఒకసారి తినడం లాంటివి చేసిన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: