ఇదో సంచలనమే.. 30 ఏళ్ల తర్వాత నోరు తెరిచిన మహిళ..?

praveen
సాధారణంగా కొన్ని కొన్ని సార్లు ఎవరూ ఊహించని విధంగా జననాలు జరుగుతూ ఉంటాయి ఇక వింత రూపంతో ఎంతో మంది జన్మిస్తూ ఉంటారు. ఇక్కడ ఓ మహిళా ఇలాగే జన్మించింది. సాధారణంగా అయితే ప్రతి ఒక్కరు రెండు పెదాలు నోటితో పుడతారు ఇక్కడున్న మహిళలకు మాత్రం అలాంటివి ఏమీ లేవు.. ఎందుకంటే ఇక పుట్టుకతోనే రెండు పెదాలు అతుక్కుపోయి అసలు నోరు కూడా లేకుండా పుట్టింది.  అయినప్పటికీ సదరు మహిళ మాత్రం ఎక్కడా నిరాశ చెందలేదు. నోరు లేకపోతే ఏంటి ఆలోచన శక్తి ఉంది కదా అని ఉన్నత చదువులు చదివింది.


 మంచి ఉద్యోగం సంపాదించింది... ఇక బాగానే ప్రస్తుతం డబ్బులు కూడా సంపాదిస్తోంది. అయితే అంతా సాఫీగానే సాగిపోతోంది కానీ తాను అందరిలా మాట్లాడలేకపోతున్నాను అనే ఒకే ఒక్క నిరాశ మాత్రం ఉండేది.  అయితే ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగినప్పటికీ ఇక తాము ఏమీ చేయలేము అంటూ చేతులెత్తేసారు. కానీ ఇక్కడ కొంతమంది వైద్యులు మాత్రం ఏకంగా ఎంతో రిస్క్ చేసి ఆపరేషన్ నిర్వహించి ఇక ఆమెకు మాట్లాడే అదృష్టాన్ని కల్పించారు. ఢిల్లీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఢిల్లీలోని సర్ గంగారామ్ దావకాన లో అసాధారణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పంజాబ్ నేషనల్ బ్యాంకు లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న ఆస్తా మోంగియా అనే మహిళకు పుట్టుక తోనే నోరు అతుక్కుపోయి పుట్టడంతో.. ఇక ఇటీవలే ఇక అతుక్కుపోయిన నోరును వేరు చేసేందుకు  వైద్యులు సర్జరీ నిర్వహించారు.  ఎంతో క్లిష్టమైన సర్జరీలు నిర్వహించిన వైద్యులు విజయం సాధించారు. 3 సెంటీమీటర్లు నోరు తెరుచుకునే విధంగా సర్జరీ చేశారు ఇక భవిష్యత్తులో మరింతగా నోరు తెరుచుకుని ఉంటుంని తెలిపారు. అయితే ఇక 30 ఏళ్ల తర్వాత మాట్లాడే అదృష్టం కల్పించినందుకు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది ఆస్తా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: